2025 January Movies :ఒక సినిమా మొదలు పెట్టాము అంటే.. ఆ సినిమా పూర్తయి ప్రేక్షకులను మెప్పించే వరకు అటు దర్శక నిర్మాతలు ఇటు నటీనటుల గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి. తమ నటనను ప్రేక్షకులు మెచ్చుకుంటారా? తమ కథతో ప్రేక్షకులను అలరిస్తామా? అసలు ఈ సినిమా హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? ఫ్లాప్ అయితే ఏ కారణాలవల్ల ప్లాప్ అయ్యింది? అనే విషయాలపై తెగ ఆలోచిస్తూ ఉంటారు. ఇకపోతే ఈ 2025 సంవత్సరం ప్రారంభమై.. అప్పుడే 35 రోజులు పూర్తయ్యాయి.. ఈ నేపథ్యంలోని 2025 జనవరి 1 నుండి ఇప్పటివరకు విడుదలైన సినిమాలు ఎన్ని? వాటి బాక్సాఫీస్ ఫలితాలు ఏంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
ఇకపోతే ఇప్పటివరకు విడుదలైన చిత్రాలను బట్టి చూస్తే దాదాపు 23 చిత్రాలు విడుదలయ్యాయి. అయితే అందులో కేవలం మూడు మాత్రమే విజయాన్ని సాధించాయి.. మరి ఆ విజయం సాధించిన చిత్రాలు ఏంటి? డిజాస్టర్ గా నిలిచిన చిత్రాలు ఏవి? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
2025 జనవరి లో విడుదలయిన చిత్రాలు
1. మార్కో 1(డబ్బింగ్):
మలయాళం లో విజయవంతమైన మార్కో సినిమాను డబ్బింగ్ చేసి 2025 జనవరి 1న రిలీజ్ చేశారు. ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ అడేనీ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇది. డబ్బింగ్ చేసి తెలుగులో విడుదలైన ఈ సినిమా ఇది. తెలుగు ప్రేక్షకులను కూడా బాగా మెప్పించింది. ముఖ్యంగా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తెలుగులో యావరేజ్ గా నిలిచింది.
2. క్రావెన్ 1 (డబ్బింగ్)..
హాలీవుడ్ నుండి డబ్బింగ్ అవుతూ తెలుగులో విడుదలైన చిత్రం క్రావెన్.. మోస్ట్ అవైటెడ్ మూవీ గా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా జనవరి 1 2025న విడుదలైన విషయం తెలిసిందే. చందూర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అరియాణా డీ బోస్, అలేసాండ్రో నీవోలా, క్రిస్టోఫర్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
3. ప్రేమ చరిత్ర – కృష్ణ విజయం..
సూపర్ స్టార్ కృష్ణ ఆఖరి చిత్రంగా ప్రేమ చరిత్ర- కృష్ణ విజయం జనవరి 3వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
4. చేతిలో చెయ్యేసి చెప్పు బావా..
జనవరి 3వ తేదీన ఈ ఏడాది విడుదలైన ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావ’ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
5. డ్రీమ్ క్యాచెర్.. జనవరి 3న విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.
6. ఆటో రంగా.. జనవరి 3న విడుదలైన ఆటో రంగా సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
7. పా పా (డబ్బింగ్).. డబ్బింగ్ మూవీ పాపా సినిమా జనవరి 3న విడుదలై ఫ్లాప్ గా నిలిచింది.
8. గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న విడుదలయి డిజాస్టర్ గా నిలిచింది.
9. డాకు మహారాజ్.. బాబీ కొల్లి- బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన డాకు మహారాజ్ సినిమా జనవరి 12న విడుదల హిట్ గా నిలిచింది.
10. సంక్రాంతి కి వస్తున్నాం.. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న విడుదలై, సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.
11. గాంధీ తాత చెట్టు.. 24 జనవరి 2025 – డిజాస్టర్
12. తల్లి మనసు – 24 జనవరి 2025 – డిజాస్టర్
13. హత్య – 24 జనవరి 2025 – డిజాస్టర్
14. డియర్ కృష్ణ – 24 జనవరి 2025 – డిజాస్టర్
15. ఐడెంటిటి (డబ్బింగ్) – 24 జనవరి 2025 – డిజాస్టర్
16. హాంకాంగ్ వారియర్స్ (డబ్బింగ్) -24 జనవరి 2025 – డిజాస్టర్
17. ప్రేమిస్తావా (డబ్బింగ్) – 30జనవరి 2025 – డిజాస్టర్
18. రాజరికం – 31 జనవరి 2025 – డిజాస్టర్
19. రోమాoటిక్ లైఫ్ – 31జనవరి 2025 – డిజాస్టర్
20. మహీషా – 31జనవరి 2025 – డిజాస్టర్
21. సంహారం – 31జనవరి 2025 – డిజాస్టర్
22. మద గజ రాజ (డబ్బింగ్) – 31జనవరి 2025 – డిజాస్టర్23. ఏజెంట్ గయ్ (డబ్బింగ్ ) – 31జనవరి 2025 – డిజాస్టర్
జనవరి లో 23 సినిమాలు విడుదల ఐతే ..
1. మార్కో (డబ్బింగ్) యావరేజ్ గా నిలవగా..
2. డాకు మహారాజు ( హిట్)
3. సంక్రాంతి కి వస్తున్నాం ( సూపర్ హిట్).. ఇలా
3 సినిమాలు మాత్రమే విజయాన్ని సాధించాయి..
మిగతా 20 సినిమాలు కళామతల్లీ ఒడిలో ఓడిపోయాయి.