Nara Rohith – OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరొకవైపు అభిమానులను అలరించడానికి తాను సంతకం చేసిన మూడు సినిమాలను త్వరగా పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వంలో వస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ ‘హరిహర వీరమల్లు’ సినిమాతో జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పవన్ కళ్యాణ్.. మరొకవైపు ప్రముఖ డైరెక్టర్ సుజీత్(Sujeeth ) దర్శకత్వంలో ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ (OG ) అనే సినిమా కూడా చేస్తున్నారు.
ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి అవడంతో పవన్ కళ్యాణ్ తనకున్న బిజీ షెడ్యూల్ ని కూడా పక్కన పెట్టి, ఓజీ సినిమా కోసం డేట్స్ కేటాయించారు. ప్రస్తుతం షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇలాంటి సమయంలో తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం నారా వారి కాబోయే కోడల్ని తీసుకోబోతున్నట్లు గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో నారా వారి కాబోయే కోడలు..
తాజాగా అందుతున్న సమాచారం.. పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్లో వస్తున్న ఓజీ సినిమాలో నారా రోహిత్ కాబోయే భార్య సిరి లేల్ల (Siree lella) ఒక కీలక పాత్ర కోసం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇకపోతే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది అని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసి కూటమితో రాజకీయ ప్రయోజనాలు కాదు సినిమా ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. హీరో నారా రోహిత్ ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)కి స్వయానా తమ్ముడు కొడుకు. ఇప్పుడు సిరీ కి వరుసకు సీఎం కి కూడా కోడలు అవుతుంది. దీంతో కూటమి ఇప్పుడు రెండు రకాల ప్రయోజనాలను పొందుతోంది అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
పెళ్లికి ఆలస్యం అందుకే..?
ప్రతినిధి -2 సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైన సిరీ లేల్ల.. ఈ సినిమాతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ ఎప్పుడైతే ఈ సినిమాలో హీరోగా నటించిన నారా రోహిత్ తో పెళ్లి పీటలు ఎక్కబోతోంది అని ప్రకటించారో.. అప్పటినుంచి ఈమె భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. గత ఏడాది అక్టోబర్ 13వ తేదీన నారా రోహిత్, సిరీ లేల్ల నిశ్చితార్థం రెండు కుటుంబాల మధ్య అత్యంత ఘనంగా జరిగింది. సిరీ లేల్ల ఆస్ట్రేలియాలో తన చదువులు పూర్తి చేసింది. కానీ సినిమా మీద నటనతోనే ఇక్కడికి వచ్చిన ఈమె ప్రతినిధి-2 లో అవకాశం అందుకుంది. అందులోను ఆ సినిమా హీరో నారా రోహిత్ తో ఏడడుగులు వెయ్యబోతోంది.
నిజానికి వీరు ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అంతలోనే నారా రోహిత్ తండ్రి కన్నుమూయడంతో పెళ్లి వాయిదా పడింది. ఇక త్వరలోనే మంచి ముహూర్తం చూసి వీరికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక మరొకవైపు నారా రోహిత్.. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి ‘భైరవం’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పుడు ఈయన కాబోయే భార్య ఓజీ సినిమాలో అవకాశం దక్కించుకోబోతున్నట్లు సమాచారం.
ALSO READ:Urvashi Rautela: “నేనే ఓ బ్లూ ప్రింట్”.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఊర్వశి రౌటేలా!