BigTV English

Shivam Song from Gaami: గామి నుంచి శివమ్ సాంగ్.. ‘గూస్‌బంప్స్‌’ అంతే..!

Shivam Song from Gaami: గామి నుంచి శివమ్ సాంగ్.. ‘గూస్‌బంప్స్‌’ అంతే..!

A goosebumps song from the movie Gami


A Goosebumps Song from the Vishwak Sen’s Gami: కొత్త ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాడు టాలీవుడ్ హీరో విశ్వక్‌సేన్. అదేంటి అంత మాట అనేశారు అనుకుంటున్నారా.. ఔనండీ.. తాజాగా గామి మూవీ నుంచి రిలీజైన ట్రైలర్‌ని చూస్తేనే తెలుస్తోంది. ఇందులో పూర్తిగా డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తూ ఆడియెన్స్‌ని మెప్పించేందుకు ఈనెల 8న థియేటర్‌లోకి రానున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ వీడియో రిలీజైంది. సింగర్ శంకర్ మహదేవన్‌ పాడిన సాంగ్ రిలీజైంది. అంతేకాకుండా ఆడియెన్స్‌ నుండి మంచి రెస్ఫాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం ఈ పాటకి సంబంధించిన వీడియో దుమ్ములేపుతూ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

మాస్‌ కా దాస్ విశ్వక్‌సేన్‌ హీరోగా కంప్లీట్‌గా డిఫరెంట్‌ లుక్‌లో యాక్ట్ చేసిన మూవీ గామి. ఈ మూవీ డైరెక్టర్‌ విద్యాధర్ కగిటకు ఇది డ్రీమ్ ప్రాజెక్ట్‌. ఈ మూవీ కోసం తాను ఆరేళ్లుగా వర్క్‌ చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఈ మూవీ మొత్తానికి పట్టాలెక్కి.. ఈనెల 8న థియేటర్లకు రానుంది. ఈ క్రమంలో ఈరోజు ఈ మూవీ నుంచి శివమ్ అనే సాంగ్ రిలీజైంది.స్పిరిట్ ఆఫ్ గామి పేరుతో ఈ పాటను తీసుకొచ్చారు మూవీ టీం. నీలోని యుద్ధం శివమ్.. నీతోని యుద్ధం శివం అంటూ సాగే ఈ సాంగ్ ఆధ్యంతం భక్తి ఇంటెన్సిటితో ఉంది. ఈ మూవీ థీమ్‌ను తెలిపేలా ఈ సాంగ్ ఉంది.


దిగ్గజ గాయకుడు శంకర్‌ మహదేవన్ భక్తి పాటలకు పెట్టింది పేరు. గామిలోని శివమ్ పాటను ఆలపించగా.. శ్రీమణి ఈ పాటకు లిరిక్స్ అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ నరేశ్ కుమారన్ ఈ పాటకు స్వరాలు అందించారు. ఇంటెన్స్‌గా ఉన్న మ్యూజిక్‌, శంకర్ గానం సాహిత్యంతో గూజ్ బంప్స్‌ తెప్పించేలా ఉన్నాయి. ఈ మూవీకి ఈ సాంగే బిగ్ హైలెట్‌గా నిలిచేలా ఉంది.

Read More: రౌడీస్టార్ విజయ్ మూవీ.. ది ఫ్యామిలీ స్టార్‌ టీజర్ రిలీజ్

మానవ స్పర్శే అతడికి అతిపెద్ద భయం..అదే అతడికి అమితమైన కోరిక అనే ఇంట్రెస్టింగ్‌ లైనఫ్‌తో గామి మూవీ ఆడియెన్స్‌ ముందుకు వస్తోంది. తనకు ఉండే భయాన్ని జయించి సాధారణ స్థితికి మారేందుకు ఓ వ్యక్తి చేసే ప్రయత్నమే కాకుండా ఈ మూవీలో అఘోరకు సంబంధించిన పలు సీన్స్‌ గామి మూవీలో మెయిన్‌గా ఉండబోతోంది. అందుకే ఈ సాంగ్‌ని ముందుగా రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×