BigTV English
Advertisement

Aadhi Pinisetty: మరోసారి విలన్ రోల్‌కే ఓటేస్తున్న యంగ్ హీరో.. మ్యాజిక్ రిపీట్ అయ్యేనా.?

Aadhi Pinisetty: మరోసారి విలన్ రోల్‌కే ఓటేస్తున్న యంగ్ హీరో.. మ్యాజిక్ రిపీట్ అయ్యేనా.?

Aadhi Pinisetty: ఈరోజుల్లో యాక్టర్లుగా ప్రేక్షకులను మెప్పించాలని, వారి అభిమానం సంపాదించుకోవాలన్నా వేర్వేరు పాత్రలు, విభిన్న కథలు.. లాంటివి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ ఫార్ములాను యంగ్ నటీనటులు ఫాలో అయిపోతున్నారు. హీరో అవకాశం వస్తేనే నటిస్తాను అనే ఆలోచనను పక్కన పెట్టేసి తమ పాత్రకు ప్రాధాన్యత ఉంటే చాలు.. ఏ సినిమాలో అయినా యాక్ట్ చేసేస్తాం అన్నట్టుగా ముందుకొస్తున్నారు. అదే విధంగా కొందరు యంగ్ హీరోలు.. విలన్స్‌గా నటించడానికి కూడా రెడీగా ఉన్నారు. అలాంటి యంగ్ హీరోల్లో ఒకడు ఆది పినిశెట్టి. ఇప్పటికే పలు విలన్ రోల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆది.. ఈసారి ఒక సీనియర్ హీరోకు విలన్‌గా తలపడనున్నాడు.


విలన్‌గానే క్రేజ్

ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ఆది పినిశెట్టి (Aadhi Pinisetty). హీరోగా పరిచయమయిన కొన్నాళ్ల వరకు ఆదికి పెద్దగా సక్సెస్ రాలేదు. అయినా కూడా వెనకడుగు వేయకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మెల్లగా హీరోగా ఆదిని ప్రేక్షకులు గుర్తించడం మొదలుపెట్టారు. తెలుగులో హీరోగా నటించిన సినిమాలు కూడా ఆదికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సరైనోడు’లో విలన్‌గా నటించడంతో టాలీవుడ్‌లో ఆది కెరీర్ మలుపు తిరిగిందనే చెప్పొచ్చు. అలా తనకు మరికొన్ని విలన్ రోల్స్‌లో నటించే ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రతోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు ఆది పినిశెట్టి.


కాంబో రిపీట్

‘సరైనోడు’ తర్వాత రామ్ హీరోగా నటించిన ‘ది వారియర్’లో కూడా విలన్‌గా కనిపించాడు ఆది పినిశెట్టి. ఒక సినిమాలో క్లాస్ విలన్‌గా మరొక సినిమాలో మాస్ విలన్‌గా సమానంగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఏకంగా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘అఖండ 2’లో విలన్‌గా కనిపించనున్నాడట ఈ యంగ్ హీరో. ప్రస్తుతం ఈ విషయంపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోయినా.. బోయపాటితో ఆదికి మంచి సాన్నిహిత్యం ఉంది కాబట్టి, ఆల్రెడీ వీరి కాంబోలో ‘సరైనోడు’ వచ్చింది కాబట్టి కచ్చితంగా ‘అఖండ 2’ (Akhanda 2)లో ఆదినే విలన్‌గా బోయపాటి ఎంపిక చేసుంటాడని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఏం చేయలేకపోయాను, నిస్సహాయ స్థితిలో ఉన్నాను.. సల్మాన్ ఖాన్ ఆవేదన

తెలుగు నటుడు

ఇప్పటివరకు బాలయ్యకు ధీటైన విలన్ పాత్రల్లో నటించిన వారు ఎక్కువగా హిందీ నటులే. అందుకే ఆది పినిశెట్టి లాంటి తెలుగు వచ్చిన యంగ్ యాక్టర్‌ను బాలకృష్ణకు పోటీగా చూడడానికి యూత్ బాగా ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నారు. ‘సరైనోడు’లో ఆది నటన చూసిన వారంతా ‘అఖండ 2’లో విలన్ రోల్‌కు తను న్యాయం చేస్తాడని నమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీ అచంట ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆది.. ‘శబ్దం’ మూవీలో హీరోగా నటిస్తూ బిజీగా ఉండగా.. ‘అఖండ 2’లో విలన్ రోల్‌తో తనకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×