BigTV English
Advertisement

Green Tea: గ్రీన్ టీ తాగుతున్నారా ? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే !

Green Tea: గ్రీన్ టీ తాగుతున్నారా ? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే !

Green Tea: ఈ రోజుల్లో గ్రీన్ టీ తాగే ట్రెండ్ చాలా పెరిగింది. శరీరంలో కొవ్వు తగ్గాలన్నా లేదా చర్మ కాంతిని పెంచాలన్నా, బరువు తగ్గాలన్నా కూడా గ్రీన్ టీ తాగాలని ఆరోగ్య నిపుణులు చెబతున్నారు. గ్రీన్ టీ త్రాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా గ్రీన్ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే గ్రీన్ టీ సరైన పద్దతిలో తీసుకోకుంటే కూడా ప్రమాదమే. ఇందకీ గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది ? గ్రీన్ టీ ఎవరు తాగకూడదు ? అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


గ్రీన్ టీలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో మాంగనీస్, పొటాషియం, రాగి, ఇనుము, సోడియం, జింక్, కాల్షియం, భాస్వరం మరియు మెగ్నీషియం ఉంటాయి. దీనితో పాటు, గ్రీన్ టీలో కాటెచిన్స్ మరియు పాలీఫెనాల్స్ వంటి అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల ఖచ్చితంగా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. గ్రీన్ టీ అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారా ?


గ్రీన్ టీ లో కాటెచిన్ అనే యాంటీఆక్సిడెంట్ శరీరంలో కొవ్వును తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇదే కాకుండా గ్రీన్ టీలో కార్బోహైడ్రేట్లు, చక్కెర చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు పెరిగే ప్రమాదం లేదు.

గ్రీన్ టీలోని కెఫిన్ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కానీ మీరు కేవలం గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారని అనుకుంటే మాత్రం అది అస్సలు నిజం కాదు. దీని కోసం సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం.

గ్రీన్ టీకి ఏ పదార్థాలు కలుపుకోవచ్చు ?

గ్రీన్ టీ మాత్రమే తాగడం కంటే రుచి కోసం దానికి కొన్ని రకాల పదార్థాలను కూడా కలుపుకోవచ్చు. తేనె, అల్లం, నిమ్మకాయ, తులసి, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, పసుపు లేదా పుదీనాను దీనికి కలుపుకోవచ్చు. కానీ అన్నింటినీ కలిపి త్రాగకూడదని గుర్తుంచుకోండి. ఒకటి లేదా రెండు పదార్థాలను మాత్రమే కలపండి. లేకుంటే గ్రీన్ టీ టేస్ట్ మారుతుంది.

గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి?

ప్రతి ఒక్కరూ వారి జీవనశైలిని బట్టి వేర్వేరు సమయాల్లో గ్రీన్ టీ తాగవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది కొంతమంది ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే జీర్ణించుకోలేరు. అలాంటి వారు ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగకూడదు.

మీరు ఉదయం వ్యాయామానికి అరగంట ముందు భోజనం తర్వాత 1 గంట తర్వాత లేదా సాయంత్రం స్నాక్ తర్వాత 1-2 గంటల తర్వాత గ్రీన్ టీ తాగవచ్చు. రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీ తాగకండి. ఇది నిద్రను ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు గ్రీన్ టీ త్రాగడం అంతమంచిది కాదు.

Also Read: ఈ ఆరోగ్య సమస్యలు తగ్గించడానికి.. కుంకుమ పువ్వు బెస్ట్ ఆప్షన్

వీళ్లు అస్సలు గ్రీన్ టీ తాగకూడదు?

గుండె, మూత్రపిండాలు, కాలేయ వ్యాధులతో బాధపడేవారు వైద్యుడిని సంప్రదించకుండా గ్రీన్ టీ తాగకూడదు. వీరే కాకుండా మరికొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు కూడా గ్రీన్ టీ అస్సలు తాగకూడదు.
గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీలు.
ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉన్నవారు.
కంటిశుక్లం సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు.
రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులు.
మైగ్రేన్లు లేదా ఆందోళన సమస్యలు ఉన్నవారు.
ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు.
నిద్రలేమి సమస్యలు ఉన్నవారు.
కెఫిన్ కు అలెర్జీ ఉన్న వ్యక్తులు.

Related News

Let them go: వెళ్లేవాళ్లని వెళ్లనివ్వండి బాసూ.. లేదంటే మనసును బాధపెట్టినవాళ్లవుతారు!

Foot Massage: ఏంటీ.. త‌ర‌చూ ఫుట్ మ‌సాజ్ చేసుకుంటే ఇన్ని లాభాలా!

Hair Thinning: జుట్టు పలచబడుతోందా ? అయితే ఈ ఆయిల్స్ వాడండి !

Jamun Seeds Powder: నేరేడు విత్త‌నాల పొడిని ఇలా వాడారంటే.. ఎలాంటి రోగమైన పారిపోవాల్సిందే!

Perfume in car: కారులో పెర్ఫ్యూమ్ వాడడం ఎంత ప్రమాదకరమో తెలిస్తే ఇప్పుడే తీసి పడేస్తారు

Water: రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగే.. అలవాటు మీలో ఉందా ?

Blue number Plates: ఏ వాహనాలకు బ్లూ నెంబర్ ప్లేట్లు ఉంటాయి? 99 శాతం మందికి తెలియదు

Parenting Tips: మీ పిల్లలు అన్నింట్లో ముందుండాలా ? ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వండి !

Big Stories

×