Aamir Khan:బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ (Aamir Khan)చెప్పిన మాట నిలబెట్టుకున్నారు అని పలువురు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఓటీటీలను బాయ్ కాట్ చేస్తూ ఇకపై తన సినిమాలను ఓటీటీలో విడుదల చేయనని ప్రూవ్ చేశారు కూడా. అందులో భాగంగానే తాజాగా అమీర్ ఖాన్ నటిస్తున్న ‘సితారే జమీన్ పర్: సినిమాను గతంలో నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు వార్తలు రాగా.. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అమీర్ ఖాన్ నటిస్తున్న ఈ సితారే జమీన్ పర్ సినిమా ఓటీటీలో కాదు నేరుగా థియేటర్లలో విడుదల కాబోతోంది. థియేటర్లో విడుదలైన తర్వాత ఏ సినిమా అయినా 8 వారాలకు ఓటీటీలోకి రావాల్సిందే. కానీ ఈ సినిమా ఇకపై థియేటర్లో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత కూడా ఓటీటీ లోకి రాకుండా యూట్యూబ్లో విడుదల చేయబోతున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే యూట్యూబ్లో కూడా డబ్బులు కట్టి ఈ సినిమాను చూడాలంట.. ప్రస్తుతం ఈ విషయం విని కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేసినా.. మరికొంతమంది చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. ఓటీటీని బాయ్ కాట్ చేస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు
ఓటీటీనీ బాయ్ కాట్ చేయాలి..
ఇదిలా ఉండగా.. ఈ నెల 3న వేవ్స్ సమ్మిట్ కి హాజరైన అమీర్ ఖాన్ ఓటీటీ పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. థియేటర్లలో విడుదలైన సినిమాలు తక్కువ సమయంలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు థియేటర్లలో విడుదలైన సినిమా దాదాపు 8 నెలల తర్వాత టీవీలో ప్రసారమయ్యేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఉదాహరణకు ఒకవేళ నేను ఒక ప్రోడక్ట్ మీకు విక్రయిస్తున్నాను అనుకోండి. ప్లీజ్ ఈ వస్తువును కొనండి లేదంటే మరో ఎనిమిది వారాల తర్వాత నేను మీ ఇంట్లోనే పెడతాను అంటే మీరు దేనిని ఎంపిక చేసుకుంటారు. ఓటీటీ విషయంలో కూడా అంతే. అందుకే థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య కూడా తగ్గుతోంది .ఆడియన్స్ ను థియేటర్లకు రావద్దని మనమే ఇలా పరోక్షంగా చెబుతున్నట్లు అనిపిస్తోంది అందుకే సినిమాలు విజయవంతం కావడం లేదు.. అని తెలిపారు
అందుకే నా సినిమాలు ఓటీటీలో విడుదల చేయను – అమీర్ ఖాన్
ఆయన మాట్లాడుతూ.. ఇకపై నా సినిమాలను ఓటీటీ లో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నాను.. నా సినిమాలను థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తాను. అంటూ తెలిపారు.ముఖ్యంగా తన సినిమాలను థియేటర్లలో పెద్ద స్క్రీన్ మీద చూడాలని ప్రేక్షకులు భావిస్తున్నారు.అది సినిమా అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. అందుకే నా సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తాను. అలాగే సినిమాను థియేటర్లలో విడుదల చేయడం వల్ల సినిమా వ్యాపారాన్ని మరింత ప్రోత్సయించవచ్చని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ ఓటీటీ సినిమాలు థియేటర్ల మీద ప్రభావం చూపుతున్నాయి. అందుకే ఇకపై ఓటీటీలో నా సినిమాలను విడుదల చేయను అంటూ నాడు ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. ఇక అమీర్ ఖాన్ తాజాగా నటిస్తున్న ‘సితారే జమీన్ పర్’ చిత్రం 2025 జూన్ 20న థియేటర్లలో విడుదల కాబోతోంది. 2007లో వచ్చిన ‘తారే జమీన్ పర్’ సినిమా ఆధ్యాత్మిక సీక్వెల్ ఇది. అమీర్ ఖాన్, జెనీలియా దేశ్ ముఖ్ నటించిన స్పోర్ట్స్ కామిడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆర్.ఎస్.ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నారు.
ALSO READ:Kannappa : మంచు విష్ణుకు బిగ్ షాక్.. మూవీ ఉన్న హార్డ్ డ్రైవ్ ని కొట్టేసారు.. ఇద్దరు అరెస్ట్..!