BigTV English

Aamir Khan: సినిమాలు వదిలేసి కొత్త రూటులోకి స్టార్ హీరో.. ఇవన్నీ అవసరమా అంటూ ఆడియన్స్ ట్రోల్స్

Aamir Khan: సినిమాలు వదిలేసి కొత్త రూటులోకి స్టార్ హీరో.. ఇవన్నీ అవసరమా అంటూ ఆడియన్స్ ట్రోల్స్

Aamir Khan: చాలావరకు సీనియర్ హీరోలు సైతం తమ వయసుకు తగిన పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు. అంతే గానీ సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని, ఇండస్ట్రీల నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని గానీ ఎవరూ ఆలోచించడం లేదు. కానీ ఒక బాలీవుడ్ స్టార్ హీరో మాత్రం గత కొన్నేళ్లుగా సినిమాల నుండి రిటైర్మెంట్ తీసుకునే ప్లాన్స్‌లో ఉన్నాడు. అంతే కాకుండా హీరోగా యాక్టింగ్ మానేసి, నిర్మాతగా, దర్శకుడిగా బిజీ అవ్వాలని అనుకుంటున్నాడు. ఆ హీరో మరెవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరో అమీర్ ఖాన్. ప్రస్తుతం నిర్మాతగా బిజీగా గడిపేస్తున్న అమీర్ ఖాన్.. తాజాగా మరో కొత్త రూటులోకి ఎంటర్ అయ్యాడు. ఇది ప్రేక్షకులకు కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కూడా.


అమీర్ ఖాన్ టాకీస్

ఈరోజుల్లో చాలామంది స్టార్ హీరోలకు సెపరేట్‌గా యూట్యూబ్ ఛానెళ్లు ఉన్నాయి. కానీ ఆ ఛానెళ్లను చాలావరకు తన సినిమా అప్డేట్స్‌ను షేర్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారు. వారి పర్సనల్ లైఫ్ గురించి, సినిమాలకు సంబంధించి చాలామంది తెలియని విషయాల గురించి ఆ యూట్యూబ్ ఛానెల్స్‌ను అప్లోడ్ చేయడానికి ఆ హీరోల దగ్గర టైమ్ ఉండదు. కానీ అమీర్ ఖాన్ మాత్రం కాస్త డిఫరెంట్ అంటున్నాడు. ప్రస్తుతం తను చాలావరకు సినిమాలు చేయడం తగ్గించేశాడు కాబట్టి యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా ఆ యూట్యూబ్ ఛానెల్‌లో ఎలాంటి వీడియోలు అప్లోడ్ చేస్తాడో కూడా గ్లింప్స్ ఇచ్చాడు అమీర్ ఖాన్.


కొత్త ప్రపంచం

‘అమీర్ ఖాన్ టాకీస్’ (Aamir Khan Talkies) అనే పేరుతో కొత్త యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు ఈ స్టార్ హీరో. అయితే ఈ యూట్యూబ్ ఛానెల్‌లో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలి అనుకునేవారికి, ఫిల్మ్ మేకర్స్ అవ్వాలనుకుంటున్న వారికి పాఠాలు చెప్తానని అంటున్నాడు అమీర్ ఖాన్ (Aamir Khan). దాంతో పాటు దీని ద్వారా సబ్‌స్క్రైబర్లకు ఎంటర్‌టైన్మెంట్ కూడా అందిస్తా అంటున్నాడు. ‘సినిమా, కథలు, ఫిల్టర్ లేని మూమెంట్స్. మేము మిమ్మల్ని నవ్వించే, ఏడిపించే కథలను ఇన్నాళ్లుగా క్రియేట్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు అమీర్ ఖాన్ టాకీస్‌తో మీకు ముందెన్నడూ చూపించని సినిమా ప్రపంచాన్ని చూపించబోతున్నాం’ అంటూ ఈ యూట్యూబ్ ఛానెల్ గురించి తన సోషల్ మీడియాలో ప్రకటించాడు అమీర్ ఖాన్.

Also Read: నావి చెత్త సినిమాలు, అందుకే ఫ్లాప్ అయ్యాయి.. సెల్ఫ్ ట్రోల్ చేసుకున్న సల్మాన్ ఖాన్

అన్నీ పంచుకుంటా

సినిమాల గురించి, ఫిల్మ్ మేకింగ్ గురించి మాట్లాడడం కోసం ఒక ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేయాలని ఎప్పటినుండో ఉండేదని ఈ వెల్‌కమ్ వీడియోలో చెప్పుకొచ్చాడు అమీర్ ఖాన్. తను నేర్చుకున్న పాఠాల గురించి, తన ప్రయాణం గురించి అందరితో పంచుకోవడానికి ఆశపడుతున్నట్టు తెలిపాడు. తన యూట్యూబ్ ఛానెల్‌ను కేవలం ప్రమోషన్స్ కోసమే కాకుండా సినిమా వెనుక ఉన్న విశేషాలను, ఇండస్ట్రీ నిపుణులతో జరిగే చర్చలను కూడా చూపిస్తానని అంటున్నాడు అమీర్ ఖాన్. ఇప్పటికే ఈ ఛానెల్‌లో తన మొదటి వీడియోను అప్లోడ్ చేశాడు. ‘లాపతా లేడీస్’లో పోలీస్ పాత్ర కోసం తను ఇచ్చిన ఆడిషన్ వీడియోను షేర్ చేసి ఛానెల్‌‌ను స్టార్ట్ చేశాడు అమీర్ ఖాన్.

Tags

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×