BigTV English

Roja Comments: విహార యాత్రల కోసం సీఎం, మంత్రులు ప్లాన్ చేసుకుంటూ.. వరద బాధితులను పట్టించుకోవట్లేదు: రోజా

Roja Comments: విహార యాత్రల కోసం సీఎం, మంత్రులు ప్లాన్ చేసుకుంటూ.. వరద బాధితులను పట్టించుకోవట్లేదు: రోజా

Roja Sensational Comments amid huge floods in Vijayawada: భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. విజయవాడను వరద నీరు పూర్తిగా ముంచెత్తింది. పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఎటు చూసినా ఆర్తనాదాలు, చుట్టూ వరద నీరు కనిపిస్తున్నది. ఇటు సీఎం చంద్రబాబు విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. బాధితులను పరామర్శించి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా స్పందించారు. ఇందుకు సంబంధించి ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో రోజా ఇలా పేర్కొన్నారు.


Also Read: భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థం.. ఇంతటి ఉపద్రవానికి కారణమేంటి ?

‘విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారు. వారి కష్టాలు వర్ణనాతీతం.. వారి మాటలు విటుంటే నాలుగురోజుల నుండి వాళ్లు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతుంది. కనీసం పసిబిడ్డలకు పాలు కూడా అందలేదు. రోజుల తరబడి మంచి నీళ్లు కూడా అందలేదు. ఎంతమంది వరదల్లో కొట్టుకువెళ్లిపోయారో కూడా తెలియని పరిస్థితి. ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంత మంది ప్రాణాలు పోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైపల్యమే కారణం. మంత్రులు విహార యాత్రలకు వెళ్లి.. ప్రజలను వరదల్లో ముంచేశారు. ఇదేదో నేను విమర్శించడానికి చెప్తున్న మాట కాదు.. మనం ఏ టీవీ చూసినా ప్రజలు ఎంత నరక యాతన అనుభవిస్తున్నారో తెలుస్తుంది. జనాలను మూడు రోజులపాటు ఎలా గాలికొదిలేశారో వాళ్ల మాటల్లోనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది.


విజయవాడ మునిగిపోతుంటే ఈ ప్రభుత్వం ఐదు రోజులైనా కనీసం ఆహారం కూడా అందించడంలో విఫలం కావడం దారుణం. వరద సహాయ చర్యల్లో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. చంద్రబాబు ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు వచ్చినా కనీసం ప్రజలను ఆదుకోలేకపోయారంటే.. ఇది ముమ్మాటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యమే. కనీసం గంట ముందు అప్రమత్తం చేసినా విజయవాడ నగరంలోని ప్రజలు ముంపు బారిన పడేవారు కాదు. నాలుగు రోజుల పాటు కరెంట్ లేకుండా, నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా కష్టాలు పడ్డారంటే… ఇంతకంటే ఘోరమైన వైఫల్యం మరొకటి ఉండదు. నాలుగు రోజుల పాటు సుమారు మూడు లక్షల మందిని ముంచేసి కనీసం నీళ్లు, పాలు కూడా అందించకపోవడం అంటే ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు.

Also Read: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి, మంత్రులకు వీకెండ్ విహార యాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు కానీ, ప్రజల కష్టాల కోసం ఆలోచించడం లేదు. సీఎం నుండి మంత్రుల వరకు అందరూ వీకెండ్ విహార యాత్రలకు ప్లాన్ చేసుకున్నారు. వాతావరణ శాఖ భారీ వర్షాలు పడతాయని ముందస్తుగానే సమాచారం ఇచ్చినా, కనీసం సీఎం చంద్రబాబు కానీ.. హోంమంత్రి కానీ, పంచాయతీరాజ్ మంత్రి కానీ, రెవెన్యూ మంత్రికానీ, మున్సిపల్ శాఖ మంత్రి కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ… ఒక్కరంటే ఒక్కరు కూడా ఎలాంటి సమీక్ష కూడా చేయలేదు.

ప్రభుత్వం భారీ వర్షాలపైనా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వలన 10 మంది ప్రాణాలు పోయాయి. వరదల కోసం కూడా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వలన ఏకంగా మూడు లక్షల మంది విజయవాడ సెంట్రల్, వెస్ట్, మైలవరం, నందిగామ, గన్నవరం, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాల్లో జనం వరదలో చిక్కుకుపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేయాలి. ఆహారం కోసం ఆర్తనాదాలు చేస్తున్న వరద బాధితులకు వెంటనే ఆహారం అందించాలి’ అంటూ రోజా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Related News

Vijayawada Loan Scam: బెజవాడలో కిలాడీ లేడీ.. లోన్లు ఇప్పిస్తానని రెండువేల మందికి టోకరా

Bhavani Rapido Success: భర్త అనారోగ్యం.. రాపిడో బైక్‌తో అండగా భవానీ.. ట్వీట్ చేసిన టిడిపి!

AP Govt decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. ఆ గ్రామాలపై బిగ్ ప్లాన్.. అదేమిటంటే?

India pension plan: 60 ఏళ్ల తర్వాత కూడా టెన్షన్ ఫ్రీ.. ఈ సూపర్ స్కీమ్ మీకు తెలుసా!

CM Chandrababu: మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్

Free bus scheme: ఏపీలో ఫ్రీ బస్ “చిత్రాలు”.. తెలుసుకుంటే టెకననాలజీ అనేస్తారు!

Big Stories

×