BigTV English

Jagapathi Babu: నీకు నాకు కొవ్వు ఎక్కువ.. మంచు వారసురాలిని పట్టుకొని అంత మాట అనేశాడు ఏంటి.. ?

Jagapathi Babu: నీకు నాకు కొవ్వు ఎక్కువ.. మంచు వారసురాలిని పట్టుకొని అంత మాట అనేశాడు ఏంటి.. ?

Jagapathi Babu: విలక్షణ నటుడు జగపతి బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ హీరోగా అప్పట్లో ఒక ఊపు ఊపిన ఈ హీరో.. ఇప్పుడు విలన్ గా కూడా తన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న జగ్గు భాయ్.. ఇంకోపక్క సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటాడు. సినిమాల్లో పాత్రలు కన్నా.. సోషల్ మీడియాలో ఆయన పెట్టే ఫోటోషూట్స్ కే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఆయన తెలుగులో రాసే.. ప్రాసలకు, పంచ్ లకు అయితే ఫ్యాన్స్ ఫిదా అవుతారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


ఇండస్ట్రీలో మాస్క్ లేకుండా నిజాలు మాట్లాడే వ్యక్తుల్లో జగపతి బాబు ఒకరు. ఎలాంటి విషయాన్నీ అయినా నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. అంతేనా ఇండస్ట్రీలో సెలబ్రిటీలతో ఆయనకు ఉన్న అనుబంధం వేరే లెవెల్ అని చెప్పాలి. మరీ ముఖ్యంగా జగ్గూభాయ్ కు మంచు ఫ్యామిలీకి ఉన్న అనుబంధం గురించి అందరికి తెల్సిందే. జగ్గు భాయ్ పెట్టే పోస్టులకు మంచు వారసురాలు మంచి లక్ష్మీ కూడా కామెంట్ చేస్తూ ఉంటుంది.

ఇక ఈ మధ్యనే జగ్గు భాయ్ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఉదయాన్నే లేచి వాకింగ్ చేశాక తానూ ఎలాంటి ఫుడ్ ను తీసుకుంటాడో చెప్పుకొచ్చాడు. మొదట కాకర కాయ జ్యూస్ తాగాను.. అది చెండాలంగా ఉంది. ఆ తరువాత బెండకాయ జ్యూస్ తాగాను.. అది మరింత చెండాలంగా ఉంది. అయినా తాగేసా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియోపై మంచు లక్ష్మీ ..బెండకాయ జ్యూస్ ఎందుకు అని కామెంట్ చేసింది. దానికి జగపతి బాబు సమాధానమిస్తూ.. ” లచ్చిమి ..బెండకాయ రసం కొలెస్ట్రాల్‌కి చాలా మంచిది.. నీకు నాకు కొవ్వు ఎక్కువ కాబట్టి ఇంకా మంచిది.. చాలా అవసరం” అని చెప్పుకొచ్చాడు.


ఇక కొద్దిసేపటికే ఈ కామెంట్ ను డిలీట్ చేశాడు. అదేంటి.. జగ్గు భాయ్.. లక్ష్మీని అంత మాట అనేశాడు. వారి మధ్య ఎలాంటి అనుబంధం ఉన్నా మరి కొవ్వు అని ఎలా అంటాడు అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. ఇంకొంతమంది మాత్రం జగ్గు భాయ్.. సరదాగా అని ఉంటాడు. వారి మధ్య అలాంటి బాండింగ్ ఉంది అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Big Stories

×