E-Paper
Advertisement

Kangana Reaction on Lok Sabha Ticket: లోక్‌సభ ఎంపీ సీటుపై కంగనా రియాక్షన్.. ఇకపై ఆ విధంగా పని చేస్తాను!

Kangana Reaction on Lok Sabha Ticket: లోక్‌సభ ఎంపీ సీటుపై కంగనా రియాక్షన్.. ఇకపై ఆ విధంగా పని చేస్తాను!
Advertisement

kangana

Kangana Ranaut Reacts on Lok Sabha Elections 2024 Ticket: బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటీమణులలో కంగనా రనౌత్ ఒకరు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది.

Advertisement

అంతేకాకుండా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది. అంతేకాకుండా తనపై వచ్చిన ఆరోపణలను తిప్పి కొట్టడంలో కంగనా ఎప్పుడు ముందుంటుంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటూ.. బాలీవుడ్ పై అలాగే దేశంలోని సమస్యలపై రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇక సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్న ఈ భామ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. చాలా కాలంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ వస్తున్న ఈ బ్యూటీకి తాజాగా బీజేపీ లోక్‌సభ టికెట్ ఇచ్చింది.

Advertisement

Also Read: తమన్నాతో డేటింగ్ ఎప్పుడు మొదలైందో చెప్పిన విజయ్ వర్మ.. మరి పెళ్లి సంగతేంటి..

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ 111 మందితో ఐదో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని బీజేపీ కల్పించింది.

ఆమె సొంత నియోజకవర్గం, పుట్టి పెరిగిన గ్రామం హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనుంది. అయితే బీజేపీ తనకు సీట్ ఇవ్వడంపై కంగనా తాజాగా స్పందించింది.

తాను బీజేపీకి మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నానని తెలిపింది. బీజేపీ నేషనల్ లీడర్స్ తనకు ఎంపీ సీట్ కేటాయించారు. అదికూడా తాను పుట్టిన ప్లేస్ నుంచి కేటాయించడం సంతోషంగా ఉందని పేర్కొంది. వారి నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని తెలిపింది.

Also Read: ఈ రోజు టీవీల్లో సందడే సందడి.. ఏకంగా 60కి పైగా సినిమాలు ప్రసారం.. ఇదిగో ఫుల్ లిస్ట్

అఫీషియల్‌గా బీజేపీలో జాయిన్ అయినందుకు గౌవరంగా ఫీల్ అవుతున్నట్లు చెప్పింది. అంతేకాకుండా బీజేపీ కార్యకర్తగా, పబ్లిక్ సర్వెంట్‌గా ఇకపై పని చేస్తాను అని చెప్పుకొచ్చింది.

Kangana Ranaut Contesting Lok Sabha Polls 2024 from BJP

కంగనా రనౌత్‌తోపాటు ఈ లిస్ట్‌లో బాలీవుడ్ సూపర్ హిట్ సీరియల్ దృశ్యకావ్యం రామాయణ్ టీవీ సీరియల్‌లో రాముడి పాత్రలో నటించిన నటుడు అరుణ్ గోవిల్‌కు కూడా బీజేపీ టికెట్ కేటాయించింది. ఈ మేరకు మీరట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా అరుణ్ పోటీ చేయనున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×