BigTV English

Manchu Vishnu: ఏంటి విష్ణు ప్రభాస్ ను అంత మాట అన్నావ్, అవసరం తీరిపోయిందా.?

Manchu Vishnu: ఏంటి విష్ణు ప్రభాస్ ను అంత మాట అన్నావ్, అవసరం తీరిపోయిందా.?

Manchu Vishnu: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో ప్రభాస్ ఒకరు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ముఖ్యంగా ప్రభాస్ ఇప్పుడు ఒక సినిమా చేశాడంటే. డే వన్ 100 కోట్లకు పైగా కలెక్షన్స్ కొట్టే స్టామినా ఉన్న నటుడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలయ్యాయి. ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కాకపోయినా కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. అలానే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రస్తుతం ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి. మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు ప్రభాస్.


కన్నప్ప సినిమాలో ప్రభాస్

మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నప్ప అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతుంది. ఈ సినిమాలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి నటులు నటిస్తున్నారు. ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు లేకపోయినా కూడా ప్రభాస్ కోసం చాలామంది థియేటర్ కు వచ్చే వాళ్ళు ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మంచు ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమాలు చూసి ఆడియన్స్ చాలా రోజులు అయిపోయింది. మంచు ఫ్యామిలీ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే కొంతమంది ఆడియన్స్ థియేటర్ దరిదాపులకు వెళ్లడం కూడా మానేశారు అనడం వాస్తవం. సన్నాఫ్ ఇండియా సినిమా ఫలితాన్ని మనం అందరం చూసింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన జిన్నా సినిమా కూడా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. అందుకోసమే ఇంత మంది నటులను విష్ణు నమ్ముకుంటున్నాడు అని ట్రోల్స్ కూడా ఉన్నాయి.


ప్రభాస్ లెజెండరీ యాక్టర్ కాదు

ఇక ప్రస్తుతం ప్రభాస్ గురించి మంచు విష్ణు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నా దృష్టిలో ప్రభాస్ నార్మల్ యాక్టర్ మాత్రమే. లెజెండ్ యాక్టర్ ఏం కాదు. ప్రభాస్ లెజెండ్ యాక్టర్ గా మారడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. కానీ, మోహన్లాల్ మాత్రం లెజెండరీ యాక్టర్. ఎందుకంటే కాలం మోహన్లాల్ గారిని లెజెండరీ నటుడిని చేసింది. రాబోయే కాలంలో ప్రభాస్ చేసే సినిమాలు తప్పకుండా ఏదో ఒకరోజు లెజెండ్ ను చేస్తాయని నమ్ముతున్నాను. మొత్తానికి లెజెండ్ యాక్టర్ కాదు అని చెప్పి మరి ఏదో ఒక రోజు అవుతాడు అని చెప్పారు. మంచు విష్ణు చెప్పిన ఈ తీరు చూస్తుంటే నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో సునీల్ వెంకటేష్ ఉద్దేశించి ఏదో ఒక రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు అనే అంత వెటకారంగా ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×