Nani: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. సినిమాలు చేయడం కాదు కానీ, ఆ సినిమాలన్నీ విజయాలు అందుకునేలా కథలను ఎంచుకుంటున్నాడు చూడండి.. అందుకు నానిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు అభిమానులు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం.. ఇలా మూడు సినిమాలు.. మూడు డిఫరెంట్ జోనర్లు. మూడు సూపర్ హిట్లు.. అది కేవలం నానికే సాధ్యం.
ఇక నాని కెరీర్ బెస్ట్ ఫిల్మ్స్ లో దసరా తప్పకుండా ఉంటుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. సూరి పాత్రలో నాని నటించాడు అని చెప్పడం కన్నా జీవించాడు అని చెప్పొచ్చు. రా అండ్ రస్టిక్ పాత్రలో నానిని చూసిన అభిమానులు.. ఏం యాక్ట్ చేసాడురా న్యాచురల్ స్టార్ అనిపించుకున్నాడు అని చెప్పుకొచ్చారు. రికార్డ్ కలక్షన్స్ తో పాటు అవార్డులను కూడా అందించింది.
Prabhas- Mahesh Fans: ప్రభాస్ ఫ్యాన్స్ వదిలేశారు.. మీరెందుకు అంతలా రెచ్చిపోతున్నారు..
ఒక హిట్ కాంబో రీపీట్ అవ్వాలంటే చాలా టైమ్ పడుతుంది. కానీ, నాని, శ్రీకాంత్ ఓదెల మాత్రం ఏడాది కూడా దాటకముందే మరో సినిమాకు రెడీ అవుతున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం నానిఓదెల 2. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది. ఇక గత కొన్నిరోజులుగా నాని ఓదెల 2 కు ప్యారడైజ్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్న విషయం తెల్సిందే.
తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ.. నాని.. అవును నాని ఓదెల 2 కు ది ప్యారడైజ్ అనే టైటిల్ ను ఫిక్స్ అయ్యాం అని పోస్టర్ తో సహా అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్టర్ లో ది ప్యారడైజ్ టైటిల్ మొత్తాన్ని ఇంగ్లీష్ లో చూపిన్చచారు. అందులో THE లో ఛార్మినార్ ను చూపించారు.. ఇక ప్యారడైజ్ లో గన్స్, మంటలు కనిపిస్తున్నాయి. దీంతో పోస్టర్ తోనే అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి.
దసరాలానే ఇది కూడా విలేజ్ కథగా తెరకెక్కుతుంది అని అంటున్నారు. పోస్టర్ చూస్తుంటే.. దసరాను మించి ఈ కాంబో ఏదో చేస్తుందని అనిపిస్తుంది. దీంతో అభిమానులు పోతారు.. మొత్తం పోతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో నాని ఓదెల ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
#THEPARADISE 🐦⬛🩸🩸🩸 pic.twitter.com/pPXnaZNvcC
— Srikanth Odela (@odela_srikanth) November 6, 2024