Amaran – Sugamya Shankar: డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి (Raj Kumar Periasamy) దర్శకత్వంలో మేజర్ ముకుంద్ వరదరాజన్ (Mukundh Varadarajan) జీవిత చరిత్ర ఆధారంగా లవ్, యాక్షన్, ఎమోషనల్ , థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కించిన చిత్రం అమరన్ (Amaran ). కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva karthikeyan), సాయి పల్లవి (Sai Pallavi) జంట గా.. తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైంది. విడుదలైన మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా లో ముకుంద్ వరదరాజన్ క్యారెక్టర్ లో శివ కార్తికేయన్, ఆయన భార్య ఇందు రెబికా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి ఒదిగిపోయి మరీ నటించారు.
శివ కార్తికేయన్ చెల్లిగా సుగమ్య శంకర్..
విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.34 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా.. ఇప్పటికీ అదే జోష్ తో కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతోంది. ఇకపోతే ఈ సినిమాలో శివ కార్తికేయన్ (ముకుంద్ వరదరాజన్) చెల్లి పాత్రలో నటించిన ఒక బ్యూటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈమె గురించి తెలుసుకోవడానికి అభిమానులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇకపోతే ముకుంద్ వరదరాజన్ చెల్లెలు నిత్య వరదరాజన్ పాత్రలో చాలా అద్భుతంగా ఒదిగిపోయింది పెనుగొండ సుగమ్య శంకర్ (Penugonda Sugamya Shankar). ఈ సినిమా విజయం సాధించడంతో నటి సుగమ్య కుటుంబ సభ్యులు మిఠాయిలు కూడా పంచి ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈమె ఎవరు అని తెలుసుకోవడానికి అభిమానుల సైతం ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈ పాత్రలో నటించడం నా అదృష్టం..
ఈమె పేరు సుగమ్య శంకర్.. భరతనాట్యం , కూచిపూడి కళాకారిణి కూడా. అలాగే ఈమె థియేటర్ ఆర్టిస్ట్ కూడా. వెబ్ సిరీస్ పాలే చోప్లు తో పాటు పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. ఈ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఈమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ” వీరమరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ కు సోదరిగా నటించడం చాలా గర్వంగా భావిస్తున్నాను. దేశానికి సంబంధించిన సినిమాలో అవకాశం రావడం మరింత ఆనందంగా ఉంది. ప్రస్తుతం నేను మరో మూడు సినిమాలలో నటిస్తున్నాను” అంటూ తెలిపింది
త్వరలో రెండు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్..
అమరన్ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా.. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా బ్యానర్ పై నిర్మించారు. ఇక ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్స్ అయిన నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ షార్ట్ స్టార్ రెండు ఫ్లాట్ ఫామ్ లు కొనుగోలు చేశాయి. వెండితెరపై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలైంది . తమిళ్ ఇండస్ట్రీకి చెందినప్పటికీ వివిధ భాషలలో డబ్బింగ్ అయ్యి అన్ని భాషా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. మొత్తానికి అయితే ఈ సినిమాలో నటించిన నటీనటులకు కూడా భారీ పాపులారిటీ లభించింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాతో సాయి పల్లవి కూడా లేడీ పవర్ స్టార్ అని ట్యాగ్ తొలగించుకొని క్వీన్ ఆఫ్ ది బాక్సాఫీస్ అనే ట్యాగ్ ను కూడా అందుకుంది.