Prabhas- Mahesh Fans: ఒకప్పుడు ఉన్న ఫ్యానిజం వేరు.. ఇప్పుడు ఉన్న ఫ్యానిజం వేరు. ఒకప్పుడు స్టార్ హీరోల ఫ్యాన్స్ అంటే.. రక్తదానం చేయడం, వారి పుట్టినరోజులు కటౌట్స్ పెట్టడం, వారి పేరు మీద అన్నదానాలు చేయడం చేస్తుండేవారు. కానీ, సోషల్ మీడియా వచ్చాకా ఫ్యానిజానికి అర్ధమే మారిపోయింది. స్టార్ హీరోల ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. మరీ మితిమీరి బూతులు తిట్టుకుంటున్నారు. హద్దుమీరి ఈ గొడవలను రియల్ గా బయటకు తీసుకొచ్చి దాడులకు పాల్పడుతున్నారు.
ఒక ఈవెంట్ లో మహేష్ బాబు ఫ్యాన్ వార్స్ గురించి క్లారిటీ కూడా ఇచ్చాడు.. మేము మేము బాగానే ఉంటాం.. మీరే మాకోసం కొట్టుకుంటారు అని. అది అక్షర సత్యం. టాలీవుడ్ స్టార్ హీరోలందరూ కలిసే ఉంటారు. కానీ, వారి ఫ్యాన్సే ఇదుగో ఇలా చిన్నదానికి పెద్దదానికి మా హీరోనే అంటారా.. ? మా హీరో ముందు మీ హీరో ఎంత అని గొడవలకు దిగుతున్నారు. గత రెండు రోజుల నుంచి టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి, కుర్ర హీరో తేజ సజ్జను మహేష్ బాబు ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. అసభ్యకరమైన మాటలతో, మీమ్స్ తో వారిని బెదిరిస్తున్నారు. అంతలా వారు చేసిన పని ఏంటి.. ? మహేష్ ఫ్యాన్స్ ఎందుకు వారిని టార్గెట్ చేశారు.. ? వీరికి, ప్రభాస్ ఫ్యాన్స్ కు మధ్య సంబంధం ఏంటి అనేది వివరంగా తెలుసుకుందాం.
Nivin Pauly : లైంగిక వేధింపుల కేసులో ఊహించని ట్విస్ట్… సినిమా స్టైల్ లో క్లైమాక్స్
ఐఫా అవార్డ్స్.. ఇండస్ట్రీలోనే అతిపెద్ద అవార్డ్స్ లో ఇది ఒకటి. ప్రతి ఏడాది దుబాయ్ లో ఈ వేడుక జరుగుతుంది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అందరు ఈ వేడుకలో పాల్గొంటారు. గత కొన్నేళ్లుగా ఈ ఈవెంట్ కు రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అతనికి కో హోస్ట్ గా ప్రతిసారి కుర్ర హీరోలు వాస్తు ఉంటారు. అయితే ఈసారి ఐఫా వేడుక.. ఐదేళ్ల గ్యాప్ తరువాత ఈ మధ్యనే గ్రాండ్ గా జరిగింది. ఈసారి రానాతో పాటు కో హోస్ట్ గా కుర్ర హీరో తేజ సజ్జ కనిపించాడు. వీరిద్దరూ చేసిన హోస్టింగ్ అక్కడ ఉన్నవారందరిని మెప్పించింది కానీ, మహేష్ ఫ్యాన్స్ ను మాత్రం నొప్పించింది.
ప్రేక్షకులను అలరించడానికి రానా, తేజ కలిసి ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ అందుకున్న విజయాలను, అపజయాల గురించి మాట్లాడారు. పరాజయాల గురించి కొంచెం సెటైరికల్ గా కూడా మాట్లాడారు. సంక్రాంతికి వచ్చిన సినిమాలు.. హనుమాన్ హిట్ అవ్వడం, గుంటూరు కారం ప్లాప్ అవ్వడం.. ప్రభాస్ ఆదిపురుష్ ప్లాప్ అయ్యిందని, కల్కి హిట్ అయ్యిందని.. మిస్టర్ బచ్చన్ ప్లాప్.. మంచు విష్ణు కాంట్రవర్సీ.. ఇలా ఈ ఏడాది మొత్తంలో ఇండస్ట్రీలో జరిగిన విషయాల గురించి సెటైర్స్ వేసి గెస్ట్ లను నవ్వించారు.
Actor Krishnudu: ఏడేళ్ల గ్యాప్.. ఆ బ్లాక్ బస్టర్ హీరోలతో రీ ఎంట్రీ..!
అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం దీన్నీ సీరియస్ గా తీసుకున్నారు. మా హీరోను అనే రేంజ్ ఉందా.. ? మీకు అంటూ బండబూతులు తిట్టడం మొదలుపెట్టారు. రానా నీ బ్రతుకు ఏంటో మాకు తెలుసు.. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని, మొన్న మొన్న వచ్చి తేజ షోలు చేస్తున్నావని, నీ తరువాత సినిమా ఎలా హిట్ అవుతుందో మేము చూస్తామని ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. రానా, తేజ మహేష్ బాబుకు, ఆయన ఫ్యాన్స్ కు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక మహేష్ కన్నా.. ప్రభాస్ సినిమా ఆదిపురుష్ పై ఇంకా గట్టిగా సెటైర్స్ వేశారు. కానీ, డార్లింగ్ ఫ్యాన్స్ ఆ కామెంట్స్ ను లైట్ తీసుకున్నారు. దాన్నంతా కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. మా హీరో గురించి అన్నా కూడా అందులో నిజం ఉంది కాబట్టి మేము కూడా ఏం అనడం లేదు. మీరెందుకు ఇంత రచ్చ చేస్తున్నారు అంటూ రెబల్ ఫ్యాన్స్.. సపోర్ట్ ఇస్తున్నారు. ఇక దీంతో నెటిజన్స్.. మహేష్ ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ను చూసి నేర్చుకోండి. వారు ఏది లైట్ తీసుకోవాలో.. దేన్నీ కాంట్రవర్సీ చేయాలో తెలుసు. అసలు అంతగా మహేష్ ను తక్కువచేసి మాట్లాడింది ఏం లేదని, కేవలం ఫన్ కోసం మాత్రమే వాళ్ళు చేశారని, అది అర్ధం చేసుకోకుండా వారిని అలా తిట్టడం పద్దతి కాదని చెప్పుకొస్తున్నారు.
BB Telugu 8: పృథ్వీ కోసం విష్ణు ప్రియ అలాంటి పని.. ఫైర్ అవుతున్న హౌస్ మేట్స్..!
ఇంకా కొంతమంది అయితే.. అసలు ఆ స్క్రిప్ట్ వాళ్లు రాయలేదు.. యాంకరింగ్ చేయడానికి వాళ్లకు డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్లు చేశారు. తిడితే స్క్రిప్ట్ రైటర్ ను తిట్టాలి కానీ, కేవలం చదివిన వారిని ఎందుకు తిడుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు అయితే అసలు స్టార్ హీరోలకే లేని ప్రాబ్లమ్ మీకెందుకు.. వాళ్లు వాళ్లు బానే ఉంటారు అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
Super ra prati deniki #trigger avtunnaru 👏 monna #dspconcert ki ippudu #IIFAUtsavam2024 event ki ( #TejaSajja & #RanaDaggubati ) meeda … Ila mana Mahesh anna Peru chedadengandi 👍
— Sanjay chowdary (@sanjutweets_) November 6, 2024
It's just a fun dialogue, even though they trolled #Adipurush #Prabhas fans took it as a part of stage comedy but #MaheshaBabu fans especially from the labor batch doing overaction against #tejasajja and #RanaDaggubati. They are trying to provoke real #mb fans, but they can't. pic.twitter.com/cfhYPZeNcG
— Bharat is Our Pride (@responsibleone3) November 6, 2024
Antha la OverReact avvalsina avasaram ledhu ankunta
Mee Opinions cheppandi ? #TejaSajja #RanaDaggubati
— AA🔥 (@VTo6VT) November 6, 2024