BJP vs Prakash Raj: ఆపరేషన్ సింధూర్‌పై రాజకీయ దుమారం రేపుతోంది. ఇటీవల నటుడు ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా ఆపరేషన్ సింధూర్‌పై ఓ ట్వీట్ చేశారు. దీనిపై తెలంగాణ బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రకాశ్ రాజ్‌ను బురదలో పందితో పోలుస్తూ.. ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ఇటీవల ప్రధానీ మోదీ ఓ ప్రకటనలో తన నరనరాల్లో దేశభక్తి ప్రవహిస్తుందని తెలపగా.. దానిని విమర్శిస్తూ ప్రకాశ్ రాజ్.. మోదీ నరనరాల్లో ప్రవహించేది దేశభక్తి కాదని.. ఆయన నరనరాల్లో ఎన్నికలే ప్రవహించేదని ఓ పోస్ట్ షేర్ చేశారు. అందులో హాస్పిటల్ సింధూర్.. సింధూర్ డొనేషన్ అని రాసి.. మోదీ రక్తంతో సింధూరం తయారు చేసి.. మహిళల నుదిటిన పెడుతున్నట్లు ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది.
ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ విమర్శలపై బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ప్రకాశ్ రాజ్ బురదలో పందితో పోలుస్తూ.. ఎక్స్ వేదికగా ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. అందులో ఆయన నటించిన ఒక్కడు సినిమాలోని ఓ సన్నివేశంలో బురదలో పడే దృశ్యాన్ని, పందితో జోడించి.. ‘రెండూ ఒకటేనా..?’ అని తెలంగాణ బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. బీజేపీ సపోర్ట్‌గా నిలిచేవాళ్లు ప్రకాశ్ రాజ్‌ను దేశ ద్రోహి అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆయన అభిప్రాయం స్వేఛ్చగా చెప్పడంలో తప్పేముంది అని కొందరు.. ఇది నిజంగానే బీజేపీ అఫిసియల్ ట్విట్టరేనా అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
Both are same ?#justsaying https://t.co/S0PPeb022n pic.twitter.com/voaBRdvUN5
— BJP Telangana (@BJP4Telangana) May 23, 2025
పాకిస్తాన్ అండతో పేట్రేగిపోతున్న ఉగ్రవాదులను గడగడా వణికించింది భారత్. ఉగ్రమూకను చెల్లాచెదురు చేసి.. వందలాది మందిని అంతం చేసింది. ఉగ్రవాదులతో పాకిస్తాన్ లింకులను ఆధారాలతో బయటపెట్టింది. టెర్రర్‌కే టెర్రర్ పుట్టించింది ఆపరేషన్ సిందూర్.
యుద్ధానికి ముందు భారత్‌పై మొండి మీసాలు మెలేసిన పాక్.. యుద్ధం మొదలయ్యాక.. మెడలు వంచింది. భారత్‌ను ఓడిస్తాం.. ఆయుధాలతో నిలువరిస్తాం అని.. బీరాలు పలికిన పాక్‌కు భారత్ షాకుల మీద షాకులిచ్చింది. ఏ ఎయిర్‌బేస్‌లను చూసి పాపి విర్రవీగిందో.. ఇప్పుడు అవే ఎయిర్‌బేస్‌లను భారత ఆర్మీ భూస్థాపితం చేసింది. మే 9వ తేదీ ఖచ్చితంగా పాకిస్థాన్ హిస్టరీలో ఒక కాళరాత్రి అని చెప్పాలి. పాకిస్థాన్‌లోని కీలక ఎయిర్‌బేస్‌లను నేలమట్టం చేస్తూ.. పాక్ గర్వాన్ని అణగదొక్కింది. మొత్తం 8 ఎయిర్‌బేస్‌లను భారత ఆర్మీ భూస్థాపితం చేసింది. ఇది ఇండియన్ గ్రేట్ సక్సెస్‌గా దేశం కొనియాడుతోంది.
Also Read: ఆ దెయ్యాలు వీళ్ళే.. కవిత లెటర్‌పై.. అద్దంకి కామెంట్స్
మొన్న బీహార్ అయిన.. నిన్న రాజస్థాన్ అయిన దేశంలో ఎక్కడికి వెళ్లిన.. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రధానీ మోదీ ఘాటుగా స్పందిస్తున్నారు. దెబ్బకు దెబ్బ కాదు.. చావు దెబ్బ కొట్టాం.. ఇది ఇప్పుడు ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ తారక మంత్రం. ఉపదేశించింది ప్రధాని మోడీ.. ఆచరించేది ఇండియన్ ఆర్మీ. ఇకపై తూటా పేలిస్తే మిసైల్స్ పడతాయని తేల్చి చెప్పారు. భారత మహిళల నుదిటిన సిందూరం తుడిచిన పాక్ ఉగ్రవాదుల ప్రాణాలు తీశామని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేశారు మోదీ.