Actor Ram Kapoor: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగి సెలబ్రిటీలు వారు ఎంతో ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా ఖరీదైన దుస్తుల నుంచి మొదలుకొని వారిని నివసించే ఇల్లు తిరిగే కార్లు కూడా చాలా ఖరీదైనవి ఉండేలా కొనుగోలు చేస్తుంటారు. ఇక ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు కార్ల కలెక్షన్ అంటే పిచ్చి ఉంటుంది. మార్కెట్లోకి ఏదైనా కొత్త కారు వచ్చిందంటే చాలు ఆ కారు వారి గ్యారేజ్ లో ఉండాల్సిందే. అది ఎంత ఖరీదైన వాటి కోసం వెనకాడరు. ఇలా ఖరీదైన కార్లను కొనుగోలు చేసేవారిలో బాలీవుడ్ నటుడు రామ్ కపూర్ (Ram Kapoor) ఒకరు.
బాలీవుడ్ నటుడు..
బాలీవుడ్ ఇండస్ట్రీలో టెలివిజన్ నటుడిగా, సినీ నటుడుగా, ఎన్నో రియాలిటీ షోలలో పాల్గొంటూ సందడి చేసినటువంటి రామ్ కపూర్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈయన వెండితెరపై కంటే కూడా బుల్లితెరపై సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు పొందారు. కసమ్ సే, బడే అచ్చే లాగ్తే హై వంటి ధారావాహిక సీరియల్స్ ద్వారా సక్సెస్ అందుకున్నారు. రాఖీ కా స్వయంవర్ అనే రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో అవార్డులను పురస్కారాలను అందుకున్నారు.
లంబోర్గిని ఎస్ఈ…
ఇలా ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్న ఈయన తాజాగా ఒక ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈయన కొనుగోలు చేసిన ఆ కారు ఏది? ఆ కారు ఖరీదు ఎంత అనే విషయానికి వస్తే… రామ్ కపూర్ కొనుగోలు చేసిన కారు లగ్జరీ కార్ల బ్రాండ్లలో ఒకటైన లంబోర్గిని ఎస్ఈ(lamborghini se) కారును కొనుగోలు చేశారు. ఎంతో ప్రత్యేకమైన ఈ మోడల్ కొనుగోలు చేసిన మొట్టమొదటి భారతీయుడుగా రామ్ కపూర్ గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇంత ఖరీదైన కారును కొనుగోలు చేసిన ఈయన తన భార్య గౌతమి కపూర్(Gowthami Kapoor) తో కలిసి కారు వద్ద దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇక ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అయితే ఈ కొత్త కారు ధర తెలిసి అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. రామ్ కపూర్ కొనుగోలు చేసిన ఈ కారు ఏకంగా రూ.5.12 కోట్ల రూపాయల ఖరీదు అనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక ఈ కారు అత్యాధునిక సౌకర్యాలతో, సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది.ఈ కారుకు 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజిన్ శక్తినిస్తుంది, ఈ ఇంజన్ 620 hp మరియు 800 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 25.9kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌పై ఆధారపడిన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్‌తో ఏర్పాటు చేయబడింది. ఇప్పటికే రామ్ కపూర్ గ్యారేజ్ లో పోర్స్చే 911, పోర్స్చే 911 టర్బో ఎస్, ఫెరారీ పోర్టోఫినో ఎం వంటి హై-ఎండ్ కార్లు ఉన్నాయి. తాజాగా ఆయన గ్యారేజ్ లోకి లంబోర్గిని ఎస్ఈ కారు కూడా వచ్చి చేరిందని చెప్పాలి.