BigTV English
Advertisement

Free Bus Service In AP: ఆ బస్సులలో నో టికెట్.. ఈ ఛాన్స్ మిస్ కావద్దు

Free Bus Service In AP: ఆ బస్సులలో నో టికెట్.. ఈ ఛాన్స్ మిస్ కావద్దు

Free Bus Service In AP: ఈ బస్సులలో ప్రయాణిస్తే, మీ వద్ద ఒక్క రూపాయి వసూలు చేయరు. నో టికెట్.. ఓన్లీ సర్వీస్.. కోసమే ఈ బస్సులు నిరంతరం ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. ఈ బస్సులను మంత్రి నారా లోకేష్ సోమవారం ప్రారంభించారు. ఉచిత బస్సులను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని లోకేష్ కోరారు. ఇంతకు ఈ ఫ్రీ బస్ సేవలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.


ఏపీలోని మంగళగిరిలో అన్ని ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. అలాగే రాజధాని అమరావతికి మంగళగిరి సమీపం కావడంతో ప్రజలు ఎక్కువగా, మంగళగిరికి రాకపోకలు సాగిస్తుంటారు. అధికార కార్యాలయాలు ఇక్కడే ఉండడంతో అధికారులు, ప్రజలు మంగళగిరికి రావాల్సిందే. అంతేకాదు టీడీపీ, జనసేన పలు ప్రధాన పార్టీల కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు చూసినా మంగళగిరి ట్రాఫిక్ తో రద్దీగా ఉంటుంది. అలాగే జనసమూహం కూడా ఎక్కువగా కనిపిస్తుంది.

ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గానికి మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ నారా లోకేష్ గెలుపు ఒక చరిత్రగా చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో లోకేష్ ఓటమిని చవిచూసినా, ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటూ లోకేష్ స్వంత నిధులను కూడా అభివృద్ది పనులకు వెచ్చించారని చెప్పవచ్చు. నియోజకవర్గంలో లోకేష్ తన మార్క్ చూపడంతో 90 వేలకు పైగా మెజారిటీతో 2024 ఎన్నికల్లో లోకేష్ ఘన విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం లోకేష్ మంత్రి హోదాలో ఉండగా, ఇక్కడ అభివృద్ది పరుగులు పెడుతుందని చెప్పవచ్చు.


మంగళగిరి ప్రజల కోసం, అలాగే ఇక్కడికి వచ్చే ప్రజల సౌలభ్యం కోసం లోకేష్ సోమవారం రెండు బస్సులను ప్రారంభించారు. MEIL ఫౌండేషన్ సమకూర్చిన రూ.2.4కోట్ల విలువైన రెండు అత్యాధునిక Olectra ఎలక్ట్రికల్ బస్సు సేవలను మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డిజిపి ఆఫీసు మీదుగా ఎయిమ్స్ వరకూ.. మరొకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాలస్వామి గుడి వరకు నడుస్తుంది. ప్రయాణికులకు ఉచిత సేవలు అందించే ఈ బస్సుల ప్రారంభ కార్యక్రమంలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. ఈ బస్సులు ఎక్కువగా మంగళగిరి వైద్యశాలలకు వచ్చే రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని స్థానిక ప్రజలు అభిప్రాయపడ్డారు.

Also Read: Mancherial District: ఒక్క ఇంజక్షన్ రూ. 16 కోట్లా? ఈ పిల్లలను ఆదుకొనే వారెవరు?

మంగళగిరికి వచ్చే ప్రజలు, స్థానిక ప్రజలు ఈ బస్సుల ద్వారా ఉచిత సేవలు పొందవచ్చని లోకేష్ తెలిపారు. ఉచిత సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన MEIL ఫౌండేషన్ సభ్యులను లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఉచిత బస్సు కావడంతో ప్రయాణికులు కూడా బస్ డ్రైవర్, సహాయకులతో గౌరవంగా మెలగాలని లోకేష్ సూచించారు.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×