BigTV English

Jyothika: ‘కంగువా’ డిశాస్టర్‌కు అవే కారణం.. భర్తకు సపోర్ట్ చేస్తూ జ్యోతిక కామెంట్స్..

Jyothika: ‘కంగువా’ డిశాస్టర్‌కు అవే కారణం.. భర్తకు సపోర్ట్ చేస్తూ జ్యోతిక కామెంట్స్..

Jyothika: ఒకప్పుడు సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయింది జ్యోతిక. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తూ కొన్నాళ్ల పాటు వెండితెరపై తన సత్తా చాటుకుంది. అలాగే సౌత్ హీరో అయిన సూర్యతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. సూర్యతో పెళ్లి తర్వాత వెండితెరకు పూర్తిగా దూరమయ్యింది జ్యోతిక. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత సినిమాల్లో గ్రాండ్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. పైగా ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో పూర్తిగా బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న జ్యోతిక.. తాజాగా ‘డబ్బా కార్టెల్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఆ సిరీస్ ప్రమోషన్స్ సమయంలో ‘కంగువా’ డిశాస్టర్‌పై స్పందించింది జ్యోతిక (Jyothika).


చెడ్డ సినిమాలు చూశాను

సూర్య (Suriya) హీరోగా నటించిన చివరి చిత్రం ‘కంగువా’ (Kanguva). ఆ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించడం మాత్రమే కాదు.. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేశారు కూడా. అందుకే ప్రతీ భాషలో తానే స్వయంగా వెళ్లి ప్రమోషన్స్ కూడా చేశాడు సూర్య. అయినా సినిమా విడుదలయిన మొదటి రోజే ఫ్లాప్ టాక్ అందుకుంది. అంతే కాకుండా అసలు ఈ సినిమా ఎలా తెరకెక్కించారు అంటూ దీనిపై విమర్శలు కూడా చేశారు. ఇక ‘కంగువా’ రిజల్ట్ విషయంలో భర్తకు సపోర్ట్ చేయడానికి జ్యోతిక ముందుకొచ్చింది. ‘‘నేను ఎన్నో చెడ్డ సినిమాలను చూశాను’’ అంటూ చెప్పుకొచ్చింది.


డిఫరెంట్ మూవీ

‘‘సౌత్‌లో చెత్తగా తెరకెక్కిన ఎన్నో కమర్షియల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యి, ఎక్కువ రేటింగ్ సంపాదించుకోవడం నేను చూశాను. కానీ నా భర్త సినిమాకు వచ్చేసరికి మరీ విచక్షణ లేకుండా రివ్యూలు ఇచ్చారు అని నాకు అనిపించింది. కొన్ని సీన్స్ బాలేకపోవచ్చు కానీ అది చేయడానికి ఎంతో కష్టపడ్డారు. అది కూడా ఒక డిఫరెంట్ మూవీ. కానీ అంత ఘోరమైన రివ్యూలు చూసినప్పుడు మీడియాపై నాకు కోపం వచ్చింది’’ అని చెప్పుకొచ్చింది జ్యోతిక. సూర్య నటించిన ‘కంగువా’ సినిమాను జ్యోతిక సపోర్ట్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. సినిమా విడుదలయ్యి నెగిటివ్ రివ్యూలు అందుకున్న వెంటనే వాటిని ఖండిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ కూడా షేర్ చేసింది జ్యోతిక.

Also Read: ప్రియాంకకు ఏకాంతంగా స్టోరీ నెరేషన్.. డైరెక్టర్ నిర్వాకం బయటపెట్టిన గ్లోబల్ బ్యూటీ తల్లి

అలాంటివే నచ్చుతాయి

‘‘కంగువాపై నెగిటివ్ రివ్యూలు చూస్తుంటే నాకు సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తోంది. అమ్మాయిలను ఏడిపిస్తూ, ఔట్‌డేటెడ్ స్టోరీలతో తెరకెక్కిన, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్న, పిచ్చి యాక్షన్ సీన్స్‌తో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఎన్నో సినిమాలకు వారు పాజిటివ్ రివ్యూలు ఇవ్వడం చూశాను. మరి కంగువాలో పాజిటివ్స్ గురించి ఏమైంది? రివ్యూ చేసేటప్పుడు మంచి విషయాలు చూడడం మర్చిపోయినట్టున్నారు. అసలు ఈ రివ్యూలను నమ్మాలా వద్దా అని నాలో అనుమానం మొదలయ్యింది. కంగువాపై మొదటిరోజే ఇంత నెగిటివిటీ చూపించడం చూస్తుంటే బాధేస్తోంది’’ అంటూ అప్పట్లోనే రివ్యూలపై తన కోపాన్ని బయటపెట్టింది జ్యోతిక.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×