BigTV English

Sudigalisudheer GOAT : అభిప్రాయ బేధాలు కారణంగా సినిమా ఆగిపోయిందా.?

Sudigalisudheer GOAT : అభిప్రాయ బేధాలు కారణంగా సినిమా ఆగిపోయిందా.?

Sudigali Sudheer – GOAT: తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా తమను తాము నిలబెట్టుకోవడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జబర్దస్త్ షో ద్వారా చాలామంది నటీనటులు కమెడియన్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. మొదట ఈ షో చేసినప్పుడు కొన్ని సినిమాల్లో గుర్తింపు పొందిన నటులు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత వాళ్లకు మంచి మంచి సినిమా అవకాశాలు రావడం వలన కొత్త తరం కమెడియన్లు నటులు వచ్చారు. వాళ్లకు కూడా మంచి అవకాశాలు వచ్చాయి. అయితే కేవలం నటులు మాత్రమే కాకుండా జబర్దస్త్ అనే షో ద్వారా ప్రసన్నకుమార్ బెజవాడ అనే రైటర్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ధనరాజ్ టీం కి ఎన్నో అద్భుతమైన స్కిట్స్ ను కూడా ఆ రోజుల్లో అందించాడు.


జబర్దస్త్ షోకి కామెడీ స్కిట్స్ రాసిన ప్రసన్నకుమార్ ఆ తర్వాత సినిమాలకు కథల రాయడం మొదలు పెట్టాడు. ప్రసన్న కుమార్ రాసిన ఎన్నో కథలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ప్రసన్న కుమార్ కి మంచి ఫ్రెండ్ నరేష్ కుప్పిలి. విశ్వక్సేన్ హీరోగా నటించిన పాగల్ అనే సినిమాకి దర్శకత్వం వహించాడు నరేష్ కుప్పిలి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అంటూ దిల్ రాజు కూడా అప్పట్లో చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా తర్వాత దమ్కీ అనే మరో సినిమాకి దర్శకుడుగా అవకాశం ఇచ్చాడు విశ్వక్సేన్.

Also Read : Pushpa : అప్పుడు దేశం మొత్తం ఫైర్ అయిన పుష్ప, ఆంధ్రాలో ఫ్లవర్ అయింది


ప్రసన్నకుమార్ బెజవాడ అందించిన కథకు నరేష్ కుప్పిలి మొదట దర్శకత్వం వహించాలి. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా నుంచి నరేష్ ను తొలగించారు. ఇక జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుదీర్ చేస్తున్న సినిమా గోట్. ఈ సినిమాకి నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ సినిమా కొంతమేరకు షూటింగ్ కూడా జరుపుకుంది. ఈ సినిమాలో సుధీర్ సరసన దివ్యభారతి నటిస్తుంది. అప్పట్లో ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. రిలీజ్ చేసిన ఆ పోస్టర్ లో డైరెక్టర్ పేరు అనేది లేకపోవటం ఆశ్చర్యం. అయితే నరేష్ ను ఈ సినిమా నుంచి కూడా తొలగించారు అంటూ వార్తలు వచ్చాయి.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, నిర్మాతకు దర్శకుడుకు మధ్య అభిప్రాయ బేధాలు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ దర్శకుడు లేకుండానే నిర్మాత సినిమాను పూర్తి చేద్దామని అనుకున్నారు. అయితే డైరెక్టర్ వల్లనే నేను ఈ ప్రాజెక్టు చేస్తున్నాను అంటూ హీరో సుదీర్ చెప్పారట. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు ముందుకు సాగకుండా అలా ఆగిపోయిందని సమాచారం వినిపిస్తుంది. దీని గురించి అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Also Read : Ram Gopal Varma Case: వర్మ వెనక ఉన్న టాలీవుడ్ హీరో ఎవరు..? ఆ ఫామ్ హౌజ్ ఎక్కడ ఉంది..?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×