Deepika Padukone: ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే (Deepika Padukone)ను ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) తన ‘స్పిరిట్’ మూవీ నుండి తప్పించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా దీపిక పదుకొనె డిమాండ్స్ నచ్చక ఆమెను పక్కన పెట్టాడని సమాచారం. అయితే బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. దీపిక పీ.ఆర్.టీమ్ మాత్రం సందీప్ మీద రివేంజ్ తీర్చుకోవడం మొదలు పెట్టింది. అందులో భాగంగానే స్పిరిట్ మూవీ కి సంబంధించిన స్టోరీని కొద్ది కొద్దిగా లీక్ చేస్తున్నారు. ఇక ఈ విషయం సందీప్ రెడ్డి వంగ వరకు వెళ్లడంతో తాజాగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇదేనా మీ ఫెమినిజం.. ఇదేనా మీ వ్యక్తిత్వం అంటూ దీపికాపై, ఆమె పీ.ఆర్ టీం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు.
ఇదేనా మీ ఫెమినిజం.. మండిపడ్డ సందీప్..
ఇక దీపికా పదుకొనే పేరు ప్రస్తావించకుండా.. “నేను ఒక నటుడిని నమ్మి, 100% సినిమా స్టోరీ ని చెప్పాను. కానీ ఇప్పుడు నా సినిమా స్టోరీని లీక్ చేస్తున్నారు. ఇదేనా మీ వ్యక్తిత్వం.. నా నుంచి పొందిన నమ్మకాన్ని మీరు ఎప్పటికీ పొందలేరు. ఎలాంటి లీకులు చేసుకుంటారో చేసుకోండి.. నాకేం ప్రాబ్లం లేదు” అంటూ సందీప్ రెడ్డి వంగ పోస్ట్ చేశారు. అయితే దీపికా పదుకొనే లీక్ చేసిన ఆ స్టోరీ ఏంటి అని ఇప్పుడు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా.. తాజాగా దీపికా పదుకొనే తరఫున దీపిక పీ.ఆర్.టీం స్పిరిట్ మూవీ నుంచి కొంత స్టోరీని లీక్ చేసింది.
స్పిరిట్ సినిమా స్టోరీ ఇదేనా..?
స్పిరిట్ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఈ సినిమాపై సందీప్ రెడ్డివంగా తన మార్కు చూపించబోతున్నారట. సాధారణంగా సందీప్ రెడ్డి వంగ సినిమాలు అంటేనే అసభ్యకర సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. A – రేటెడ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి సన్నివేశాలే ప్రభాస్ స్పిరిట్ లో కూడా ఉండనున్నాయట. తీవ్రమైన యాక్షన్ భావోద్వేగాలతో కూడుకున్న ఈ సినిమా ఖచ్చితంగా తెలుగు సినిమా సరిహద్దులను చెరిపివేస్తుంది. అసభ్యకర సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది పెద్ద ఎత్తున హింసాత్మక యాక్షన్ చిత్రం. స్పిరిట్ కథ తమిళ చిత్రమైన తేరిని కూడా పోలి ఉండవచ్చు. ప్రభాస్ అధిక పనులు, మిషన్ తర్వాత తన జీవితం ఒక నాటకీయ మలుపు తీసుకునే పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు అంటూ దీపిక పి ఆర్ టీమ్ తెలిపింది. అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ దీపికా పదుకొనే పీ ఆర్ టీం విడుదల చేసిన ఇదే స్టోరీ సందీప్ రాసుకున్న స్టోరీ సేమ్ అయితే ప్రభాస్ ను ఇలాంటి పాత్రలో చూడగలమా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Nagarjuna : మన్మథ లీలలు… హీరో పాత్రలను పక్కన పెట్టి విలన్ బాట పడుతున్నాడా..?