BigTV English

Actress Anjali : ప్రెగ్నెంట్ అంటూ భర్తకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన మొగలి రేకులు నటి… భర్త రియాక్షన్ ఏంటంటే..?

Actress Anjali : ప్రెగ్నెంట్ అంటూ భర్తకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన మొగలి రేకులు  నటి… భర్త రియాక్షన్ ఏంటంటే..?

Actress Anjali: తెలుగు బుల్లితెర నటి అంజలి మొదట ఇండస్ట్రీ లోకి రావడం అంతగా ఇష్టం లేకపోయినా.. తన తల్లి ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. యాంకరింగ్ గా తన కెరీర్ ని ప్రారంభించి మంజుల డైరెక్షన్లో వచ్చిన మొగలిరేకులు సీరియల్ లో నటించారు. ఆ సీరియల్ టెలివిజన్లో ఒక చరిత్రను సృష్టించిందని చెప్పొచ్చు. ఆ సీరియల్ తో పాపులర్ అయ్యి ఆ తర్వాత రాధా కళ్యాణం, దేవత, శివరంజని వంటి సీరియల్స్ లో నటించారు. తర్వాత కొన్ని సీరియల్స్ లో నెగిటివ్ క్యారెక్టర్స్ లో కూడా నటించి మెప్పించారు. ప్రస్తుతం ఈమె తన భర్త పవన్ తో కలిసి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశారు. తాజాగా ఆ ఛానల్లో ఈమె తన భర్తకి సర్ప్రైజ్ ఇచ్చిన వీడియో పోస్ట్ చేసింది. అసలు ఆ వీడియోలో ఏముంది.. ఆమె ఏం సర్ప్రైజ్ ఇచ్చింది.. తన భర్త ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నది ఇప్పుడు చూద్దాం..


భర్తకు సడన్ సర్ప్రైజ్..ప్లాన్ 

టెలివిజన్ రంగంలోనే చరిత్ర సృష్టించిన మొగలిరేకులు సీరియల్ లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అంజలి.. తెలుగులో లెజెండ్, ఒక లైలా కోసం వంటి సినిమాలలో నటించి మెప్పించారు. 2017లో సంతోష్ పవన్ ను వివాహం చేసుకున్నారు. 2020లో వీరికి ఒక ఆడపిల్ల జన్మించింది. తాజాగా ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో మరోసారి తను ప్రెగ్నెంట్ అయినట్టు వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో అందరితో తను ఈసారి తన భర్తకి సప్రైజ్ ఇచ్చినట్లు అంజలి తెలిపింది. మొదటిసారి ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని తన భర్తతో చెప్పే లోపే నేను ప్రెగ్నెంట్ అని తెలుసుకొని నన్ను నిద్ర లేపి చెప్పాడు. అప్పుడే అనుకున్నాను ఈసారి ప్రెగ్నెంట్ అయితే తనకు సప్రైజ్ ఇవ్వాలి అని.. అది ఇప్పుడు నాకు కుదిరింది అని వీడియోలో తెలిపింది. తర్వాత తన కూతురు దగ్గరికి వెళ్లి, నీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా అని అడిగితే తమ్ముడు కావాలి అని, పాప అంటుంది. అయితే నా బొజ్జలో చిన్న తమ్ముడు ఉన్నాడు అని అంజలి తన బేబీకి సప్రైజ్ ఇస్తుంది. ఆ తర్వాత ఆ విషయాన్ని తన భర్తతో చెప్పడానికి ఇద్దరు రెడీ అవుతారు. పవన్ ఇంటికి వచ్చిన తరువాత తన భర్తకు సర్ప్రైజ్ అంటూ తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని చెబుతుంది అంజలి. అది విని పవన్ ఆనందపడతాడు. ఎంత పెద్ద సప్రైజ్ ఇచ్చావు నాకు అని తన భార్యను హగ్ చేసుకుంటాడు పవన్. నాకు అసలు మాటలు రావట్లేదు అని ఎమోషనల్ అవుతాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని పవన్ అంటాడు. ముగ్గురు కలిసి వీడియో చేస్తారు. ఆ వీడియో చూసిన వారంతా సూపర్ కపుల్, కంగ్రాట్యులేషన్స్ అంటూ, పవన్ కి అంజలి కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


డిజైనర్ అంజలి ..

తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న నటీనటులు వారి లైఫ్ లో జరిగే ప్రతి విషయాన్ని యూట్యూబ్ లో షేర్ చేయడం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. అంజలి అలాగే తన భర్త పవన్ ఇద్దరు కలిసి యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. తన పాప చందమామ పుట్టినప్పటి నుండి ప్రతి యాక్టివిటీ కూడా యూట్యూబ్లో ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో అంజలికి మంచి ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్ లో ఆమె పెట్టే వీడియోలకు మంచి రెస్పాన్స్ తోపాటు రెమ్యునరేషన్ కూడా వస్తుంది. ఇది ఇలానే కొనసాగాలని మరిన్ని వీడియోలతో అంజలి మన ముందుకు రావాలని కోరుకుందాం.అంజలి డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. తను సొంతగా చందమామ డిజైనర్ స్టూడియోని రన్ చేస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్8 లో కొంతమంది కంటెస్టెంట్స్ కి డ్రెస్సెస్ డిజైన్ చేశారు.

Ashu Reddy : బ్రెయిన్ ఆపరేషన్… రివర్స్ ట్రిక్ వాడుతున్న అష్షు రెడ్డి

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×