Ashu Reddy : చల్ మోహన్ రంగా సినిమా ద్వారా 2018లో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో మనకి అషు కనిపిస్తుంది. తర్వాత వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు నటించింది. 2019లో బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొనడం, ఆమె మాటలు ఆమె వ్యక్తిత్వం, ప్రేక్షకులను ఆమెకు దగ్గర చేశాయని చెప్పొచ్చు. ఇటీవల అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఎమోషనల్ వీడియోని కూడా షేర్ చేసింది. ఆమెకు బ్రెయిన్ సర్జరీ గురించి అభిమానులు తెలుసుకుంటున్నారు. ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో బ్రెయిన్ సర్జరీ ఎందుకు జరిగిందో పూర్తిగా చెప్పలేదు కానీ, తనకి సర్జరీ అయినట్లు వీడియో మాత్రం పోస్ట్ చేసింది. ఆ తరువాత ఇంస్టాగ్రామ్ లో హార్ట్ లుక్స్ తో పొట్టి డ్రెస్ లో తన అందాలను కెమెరాలో బంధించి, వాటిని అభిమానులతో షేర్ చేసింది. అవి చూసినా వారంతా బ్రెయిన్ సర్జరీ తర్వాత కూడా ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉందని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఆమె మరో పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బ్రెయిన్ సర్జరీ తర్వాత..
అషు రెడ్డి ఇంస్టాగ్రామ్ లో డైలీ పోస్టులు పెడుతున్నారు. బ్రెయిన్ సర్జరీ తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటున్నారు. ఇది అభిమానులకు ఆసక్తి కలిగించే విషయమే, బ్రెయిన్ సర్జరీ చాలా క్రిటికల్ ఆపరేషన్, అలాంటి ఆపరేషన్ జరిగిన తర్వాత మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇప్పుడు అషు రెడ్డి కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, వర్కౌట్లు చేస్తున్నారు. తాజాగా ఆమె అభిమానులతో పంచుకున్న పోస్టులో రివర్స్ లో తన బాడీని కిందకి పెట్టి తన తల కింద చేతులను ఉంచి కాళ్ళను పైకి పెట్టి, వర్కౌట్ చేస్తున్నట్లు ఫోటోను షేర్ చేశారు. అది చూసిన వారంతా అషు రెడ్డి తన ఆరోగ్యం కోసం, బ్రెయిన్ సర్జరీ తర్వాత రివర్స్ ట్రిక్ ఉపయోగిస్తున్నారు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
అక్కడ ఎప్పుడు ఆమె యాక్టివ్..
అషు రెడ్డి సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటారు. ఆమె ఫ్యాషన్, లైఫ్ స్టైల్, వ్యక్తిగత అప్డేట్స్ ను ఎప్పుడూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఒక ఈ అమ్మడు యూట్యూబ్ ఛానల్ కూడా ఈమె నిర్వహిస్తుంది. ఈమె జీవితంలో ఎన్నో రూమర్స్ ని ఎదుర్కొంది. రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూలో వర్మ ఆమె కాళ్ళను తాకడంతో ఆ విషయం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. కొన్నాళ్ళు అందరూ ఆ విషయం గురించే మాట్లాడుకున్నారు. ఈమె ఎన్నో వెబ్ సిరీస్ లో నటించింది. తాజాగా ఎవరు ఎప్పుడు ఎక్కడ అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ తో మన ముందుకు వచ్చింది. ఏది ఏమైనా ఈమె ఆరోగ్యం మెరుగుపడి మరిన్ని సినిమాల్లో వెబ్ సిరీస్ లో నటించి సక్సెస్ ని అందుకోవాలని కోరుకుందాం.
HIT 3 : నాని కోసం రంగంలోకి దిగిన రాజమౌళి.. పూనకాలు లోడింగ్
https://www.instagram.com/stories/ashu_uuu/3618423810281651832?utm_source=ig_story_item_share&igsh=MTVneDJnZnF3dzZ2OQ==