Faria Abdullah : ఒక్క అవకాశం జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని విషయాలు ఎప్పటికీ అర్థం కావు. సూపర్ హిట్ సినిమాలు తో సక్సెస్ అందుకున్న చాలామంది హీరోయిన్లు ఆ తర్వాత సక్సెస్ కాలేకపోయారు. అలానే ఫెయిల్యూర్ తో ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోయిన్లు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమా ఎంత పెద్ద హిట్ అయింది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ హీరోగా పరిచయమైన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ సినిమాలో హీరోయిన్గా కనిపించింది నేహా శెట్టి. ఆ సినిమా తర్వాత వరుణ్ సందేశ్ కుర్రాడు సినిమా తప్ప ఆమెకు చెప్పుకోదగ్గ పెద్ద హిట్ సినిమాలు పడలేదు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీ లీలా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. కానీ ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో శ్రీ లీలా ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి హీరోల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది.
అనుదీప్ కేవి దర్శకత్వంలో వచ్చిన జాతి రత్నాలు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమాను ఓటీటీకి మంచి కాస్ట్ వచ్చింది అమ్మేద్దాము అని అశ్వినీ దత్ నిర్ణయం తీసుకున్న కూడా పట్టు పట్టి మరి ఈ సినిమా థియేటర్ కంటెంట్ అని రిలీజ్ చేయకుండా ఉంచారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఎట్టకేలకు కరోనా తగ్గుముఖం పట్టాక ఈ సినిమాను బాక్స్ ఆఫీస్ వద్ద విడుదల చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో కామెడీ విపరీతంగా వర్కౌట్ అయింది. ఈ సినిమాకు ఇప్పటికీ ఒక కల్ట్ స్టేటస్ ఉంది. ఈ సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది ఫరియా అబ్దుల్లా. ఈ సినిమా తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వచ్చి కెరియర్ లో దూసుకుపోతుందని అందరూ ఊహించారు.
ఫరియా కెరీర్ లో జాతి రత్నాలు సినిమా తప్ప పెద్దగా చెప్పుకునే సినిమా పడలేదు. తన చివరిగా నటించిన మత్తు వదలరా సినిమా కొంతమేరకు తనకు ప్లస్ అయింది. ఇకపోతే ప్రస్తుతం ఓంకార్ నిర్వహించే డాన్స్ ఐకాన్ టు షోలో ఫరియా అబ్దుల్లా జడ్జిగా వ్యవహరించినది. ఫస్ట్ టైం ఒక షోలో జడ్జిగా వ్యవహరిస్తుంది ఫరియా. ఫరియా డాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు జాతి రత్నాలు సినిమాలోని ప్రూవ్ అయింది. సినిమాల పైన ఫోకస్ చేయకుండా ఇలా రియాలిటీ షో లో జడ్జిగా ఉండిపోవడానికి ఎందుకు నిర్ణయించుకుందో చిట్టి కే తెలియాలి. ఇదివరకే వచ్చిన డాన్స్ ఐకాన్ షో మంచి సక్సెస్ సాధించింది. ఇక వస్తున్న ఐకాన్ టు సీజన్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
Also Read: ‘ఓయ్’ ఫ్యాన్సూ… వినిపిస్తుందా…. టికెట్లు ఇచ్చే డేట్ వచ్చేసింది