Pradeep Ranganathan: హీరోలంటే ఆరు అడుగులు ఉండాలి, సిక్స్ ప్యాక్ ఉండాలి.. లాంటి రోజులు పోయాయి. యాక్టింగ్ బాగా చేస్తే చాలు.. చూడడానికి ఎలా ఉంటే ఏంటి అంటూ నటులను ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. అలా యాక్సెప్ట్ చేయడం వల్లే కొత్త కొత్త నటులు వెండితెరపైకి వచ్చి అందరినీ ఎంటర్‌టైన్ చేయగలుగుతున్నారు. అలాంటి వారిలో ఒకరు తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్. అసలైతే డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ప్రదీప్.. ‘లవ్ టుడే’ అనే సినిమాతో తనలో దర్శకుడు మాత్రమే కాదు.. నటుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు. కానీ హీరో అవ్వాలనుకున్నప్పుడు తను ఎదుర్కున్న అవమానాల గురించి తాజాగా బయటపెట్టారు.
ఎన్నో అవమానాలు
తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా సెన్సేషనల్ హిట్ అయిన ‘లవ్ టుడే’ సినిమాను ప్రదీప్ రంగనాథన్ డైరెక్ట్ చేయడం మాత్రమే కాకుండా అందులో తానే హీరోగా కూడా నటించాడు. అలా హీరోగా తన ప్రయాణం మొదలయ్యింది. ఆ తర్వాత తనకు దర్శకుడిగా కంటే హీరోగానే ఎక్కువగా అవకాశాలు రావడం మొదలయ్యింది. అలా ప్రదీప్ హీరోగా నటిస్తున్న అప్‌కమింగ్ మూవీ ‘డ్రాగన్’ (Dragon). తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా అందులో తన కెరీర్ మొదట్లో ఎదుర్కున్న అవమానాల గురించి ఓపెన్‌గా చెప్పేశాడు ప్రదీప్. తనను కొంతమంది కిందకు లాగాలని ప్రయత్నించారని, తాను అన్ని గమనిస్తూనే ఉన్నానని చెప్పుకొచ్చాడు.
అనుపమతో నటించాను
ఒక మొక్క ఎలా అయితే వాతావరణాన్ని తట్టుకొని చెట్టుగా మారుతుందో తాను కూడా అలాగే నెగిటివిటీని ఎదుర్కుంటానని చాలా ధైర్యంగా మాట్లాడాడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ‘లవ్ టుడే’ సినిమాలో తాను హీరోగా నటిస్తున్నప్పుడు చాలామంది హీరోయిన్స్ తన పక్కన నటించడానికి రిజెక్ట్ చేశారని గుర్తుచేసుకున్నాడు. కొందరు అయితే నీతో నటించము అని మొహం మీదే చెప్పారని అన్నాడు. అలా ఆ సినిమా కోసం చాలామంది హీరోయిన్లను అడిగినా ఎవ్వరూ ఒప్పుకోలేదని తెలిపాడు. అలాంటిది ‘డ్రాగన్’లో అనుపమ పరమేశ్వరన్‌తో నటించడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు ప్రదీప్ రంగనాథన్. తను ఓపెన్‌గా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: ఫోర్బ్స్ జాబితాలో ఊహించని పేరు.. సమంత, సాయి పల్లవిని కూడా వెనక్కి నెట్టి..
స్టార్ కిడ్స్ వల్లే
‘లవ్ టుడే’ (Love Today) మూవీ హిందీలో ‘లవ్‌యాపా’ (Loveyapa) అనే పేరుతో రీమేక్ అయ్యింది. కానీ అది అనుకున్నంత విజయం సాధించలేదు. దానిపై కూడా తను తాజా ఇంటర్వ్యూలో స్పందించాడు. ‘‘నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఇమేజ్ ఉన్న పాత్రను చేశాను. కానీ అక్కడ హీరోహీరోయిన్లుగా నటించింది ఇద్దరు స్టార్ కిడ్స్ అవ్వడం వల్ల వారిని ప్రేక్షకులు కూడా అలాగే చేస్తారు. ఆ సినిమా అందరికీ నచ్చకపోవడానికి అది కూడా ఒక కారణం కావచ్చు. కానీ ఇదే కారణం అని నేను కూడా చెప్పలేను’’ అన్నాడు ప్రదీప్. తను చెప్పిన స్టేట్‌మెంట్ చాలామందికి కరెక్ట్ అనిపించింది. జునైద్ ఖాన్, ఖుషి కపూర్ వల్లే ‘లవ్‌యాపా’ ఆడియన్స్‌కు నచ్చలేదనే చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.