BigTV English
Advertisement

Ileana: మళ్లీ తల్లి కాబోతున్న ఇలియానా… ఫోటోలు రిలీజ్ చేసి…

Ileana: మళ్లీ తల్లి కాబోతున్న ఇలియానా… ఫోటోలు రిలీజ్ చేసి…

Ileana..గోవా బ్యూటీ ఇలియానా (Ileana) ఒకప్పుడు సౌత్ లో అత్యంత డిమాండ్ ఉండే హీరోయిన్ల లిస్టులో మొదటి ప్లేస్ లో ఉండేది. సౌత్ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ గా కూడా ఇలియానాకి పేరుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సడన్ గా సినిమాలు మానేసి పెళ్లి చేసుకోకుండానే తల్లై అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఇలియానా పెళ్లి చేసుకున్న ఫోటోలు ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోలేదు. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అలాగే కొడుకు పుట్టిన ఫోటోలు మాత్రం షేర్ చేసి, కొద్దిరోజులు భర్త విషయంలో అందర్నీ సర్ప్రైజ్ కి గురి చేసింది. ఆ తర్వాత కొడుకు పుట్టాక తన భర్తతో కలిసి ఉన్న ఫోటోని రివీల్ చేసింది. అయితే అలాంటి ఇలియానా రెండోసారి తల్లి కాబోతున్నట్టు గత కొద్ది రోజుల నుండి రూమర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే.


మళ్లీ బేబీ బంప్ తో ఇలియానా..

అయితే తాజాగా ఈ రూమర్ నిజమే అన్నట్లుగా ఒక ఫోటోని షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.. తాజాగా ఇలియానా రెండోసారి తల్లి కాబోతున్నట్టు బేబీ బంప్ ఫోటోని రివీల్ చేసింది. ఇందులో ఆమె మరొక ప్రెగ్నెంట్ లేడీ తో కలిసి నిల్చొని ‘బంప్ బడ్డీస్’ అంటూ ఆ ఫోటో కింద రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇలియానా బేబీ బంప్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో ఇలియానా ఆ మధ్యకాలంలో రెండోసారి తల్లి కాబోతున్నట్టు హింట్ ఇచ్చింది. కానీ ప్రస్తుతం అది నిజమే అని తాజాగా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో
షేర్ చేసిన ఫొటోస్ తో అర్థమైంది అని ఇలియానా పోస్ట్ చేసిన ఫోటోల కింద చాలామంది సెలబ్రిటీలు, అభిమానులు ఇలియానాకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే రెండవసారి ప్రెగ్నెంట్ అంటూ హింట్ ఇచ్చింది కానీ క్లారిటీ ఇవ్వలేదు. ఆ తర్వాత అటు ఇంస్టాగ్రామ్ కి కూడా దూరమైంది. ఇదిలా ఉండగా ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా చెప్పిన మాట నిజమైంది. ఎందుకంటే గత మూడు నెలలుగా అంటే ఫిబ్రవరి 25వ తేదీన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టిన ఈమె.. ఆ తర్వాత నుంచి మళ్లీ కనిపించలేదు. అభిమానులు కంగారుపడుతున్న వేళ రెండో ప్రెగ్నెన్సీ కోసమే ఆమె విశ్రాంతి తీసుకుంటుంది అంటూ బిగ్ టీవీ ప్రచురించింది. ఇప్పుడు ఆ వార్తలనే నిజం చేస్తూ ఇలియానా బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసి అందరికీ ఒక క్లారిటీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.


ఇలియానా వ్యక్తిగత జీవితం..

ఇక ఇలియానా వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే..మొదట ఆండ్రూస్ నిబోస్ అనే ఫోటోగ్రాఫర్ తో చాలా రోజులు డేటింగ్ చేసింది. ఆ తర్వాత సడన్ గా వీరిద్దరి మధ్య బంధం తెగిపోవడంతో బ్రేకప్ విషయాన్ని కూడా చెప్పుకోవడానికి ఇష్టపడలేదు.ఇక ఆ తర్వాత మళ్లీ మైఖేల్ డోలన్ తో ప్రేమలో పడింది.. ఇక మైఖేల్ ను 2023 మే లో పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వినిపించినప్పటికీ ఆ వార్తలను ఖండించింది. కానీ పెళ్లి విషయం చెప్పకపోయినప్పటికీ 2023 ఆగస్టులో ఇలియానా తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా మళ్లీ తల్లి కాబోతున్నట్టు బేబీ బంప్ రివీల్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఇలియానా సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ఇలియానా చివరిగా రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో కనిపించింది.ఆ తర్వాత నుండి సౌత్ ఇండస్ట్రీలో ఇలియానాకి అవకాశాలు రావడం లేదు.

ALSO READ: Arjun Reddy : అర్జున్ రెడ్డి వదులుకున్న మంచు వారి అబ్బాయి… ఇప్పుడు బాధ పడుతున్నాడు

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×