Lokesh Cinematic Universe: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagraj) తన సినిమాటిక్ మ్యాజిక్ తో, దర్శకత్వ ప్రతిభతో స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన విషయం తెలిసిందే. మొదటినుంచి కూడా ఎంతో వైవిద్య భరితమైన కథలను ఎంపిక చేసుకుంటూ తన సినిమాల ద్వారా ప్రేక్షకులను అల్లరిస్తున్న లోకేష్ అతి తక్కువ సమయంలోనే టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు.కార్తి హీరోగా వచ్చిన ఖైదీ చిత్రంతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)ను క్రియేట్ చేసాడు.కమలహాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాను ఖైదీ సినిమాతో లింక్ చేస్తూ చివరిలో రోలెక్స్ పాత్రతో సూర్యను లోకేష్ కనగ రాజ్ యూనివర్సల్ లో భాగం చేశారు. ఇక ఈ సినిమాటిక్ యూనివర్స్ లోకి మరొక హీరో రాఘవ లారెన్స్ (Raghava Lawrence)కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్…
కాంచన సిరీస్ తో అలరించిన రాఘవ లారెన్స్ హీరోగా ‘బెంజ్’(Benz) అనే సినిమాను ప్రకటించారు. ఈ సినిమాకు కథ, కథనంతో పాటు లోకేష్ కనగరాజ్ నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నారు. ఇక ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించగా,కోలివుడ్ యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో హీరో లారెన్స్ పాత్ర కూడా చాలా భిన్నంగా ఉండబోతుందని ఇందులో ఈయన ప్రమాదకరమైన వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.
బెంజ్ సినిమాలో సంయుక్త మీనన్…
ఇక ఈ సినిమాలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు. కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో నటించబోతున్నారు. అదే విధంగా మలయాళ హీరో నివిన్ పౌలి కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కోలీవుడ్ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్(Samyuktha Menon) భాగమవుతున్నారని, ఈ సినిమా కోసం ఈమె కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోకి అడుగు పెట్టారని తెలుస్తుంది.
ప్రస్తుతం సంయుక్త మీనన్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సంయుక్త మీనన్ అనంతరం ధనుష్ హీరోగా నటించిన సార్, విరూపాక్ష వంటి సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం బింబిసారా 2, బాలయ్య అఖండ 2 వంటి తెలుగు సినిమాల షూటింగ్ పనులలో సంయుక్త ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ప్రస్తుతం ఈమె బెంజ్ సినిమాలో కూడా నటించే అవకాశాన్ని అందుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఈ వార్తల పట్ల ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలబడలేదు.