BigTV English

Laya: అప్పట్లో నా రెమ్యునరేషన్ అంతా.. రీ ఎంట్రీకి రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే.!?

Laya: అప్పట్లో నా రెమ్యునరేషన్ అంతా.. రీ ఎంట్రీకి రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే.!?

Laya : తెలుగు హీరోయిన్ అంటే లయ.. ఆమె అందం, అభినయం తో ప్రేక్షకులను మెప్పించారు. టాలీవుడ్ హీరోయిన్ లయ ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు. ఆమె చిన్న వయసులోనే సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఆమె పదవ తరగతి చదివే టైంలో రాఘవేంద్రరావు కొత్త మూవీ నటినటుల కోసం పోటీలు నిర్వహించారు. ఆ పోటీలో లయకి రెండో స్థానం వచ్చింది.. ఈమె ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా స్వయంవరం సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చింది. ఆమూవీ ఆమెకు ఎంతో పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత ఈమె ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు. వివాహం తరువాత మూవీస్ కి బ్రేక్ ఇచ్చారు లయ. కొంతకాలంగా అమెరికాలోనే ఉంటున్న ఈమె ఇప్పుడు మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చారు. నితిన్ తమ్ముడు మూవీలో లయ హీరోకి సోదరి క్యారెక్టర్ లో నటిస్తున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మూవీస్ లో తనకి వచ్చే రెమ్యునేషన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..


తమ్ముడు మూవీ తో రీ -ఎంట్రీ ..

ఇక నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు చిత్రం రూపొందుతోంది. ఈ మూవీలో సీనియర్ నటి లయ సోదరి పాత్ర పోషిస్తున్నారు. అక్క తమ్ముడు సెంటిమెంట్తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా, లయ ఓ ఇంటర్వ్యూలో.. మీరు నటించిన సినిమాకి మీరు ఎంత రెమ్యూనేషన్ తీసుకునేవారు అని అడగ్గా.. లయ మాట్లాడుతూ.. ఇప్పట్లో అందరూ కోట్లల్లో తీసుకుంటున్నారు కానీ, అప్పట్లో లక్షల్లోనే ఉండేది. అప్పుడు అది ఎక్కువ అని చెప్పొచ్చు. నేను 2006 నుంచి సినిమాలు చేయడం మానేశాను. నేను 2011 నుండి జాబ్ చేయడం మొదలుపెట్టాను. రీసెంట్గా రీ ఎంట్రీ ఇచ్చే వరకు జాబ్ చేస్తూనే ఉన్నాను. అక్కడ నా శాలరీ, పది లక్షల వరకు వచ్చేది. మొదట్లో తక్కువ ఇచ్చేవారు, తరువాత శాలరీ ఎక్కువగా వచ్చింది అని ఆమె తెలిపింది. మొదట్లో మీకు రెమ్యునరేషన్ తక్కువ ఇచ్చేవారు అన్నారు కదా.. మరి ఇప్పుడు ఎలా ఇస్తున్నారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు, లయ మాట్లాడుతూ.. ఇప్పుడు అందరు రెమ్యూనేషన్ మీరు షాక్ అయ్యేంతగా, కోట్లలో ఇస్తున్నారా అని అడుగగా.. మనం ఎక్కడున్నాం అన్నది మనకి తెలియాలి. ఆఫర్స్ అయితే చాలానే వచ్చాయి. అన్ని సినిమాలు చేయకూడదు, మనం రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక మంచి స్టెప్ తో రావాలి అని నేను అనుకున్నాను. ఒక దారి సెట్ చేసుకొని ఈ క్యారెక్టర్స్ కి ఈమె సెట్ అవుతుంది అనే విధంగా చూస్ చేసుకోవాలి అని నా ఆలోచన. ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ అయితే కానీ మనం ఏ స్థాయిలో ఉన్నామనేది తెలుస్తుంది అని ఆమె తెలిపారు. నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో సినిమాల్లోకి వచ్చాను అప్పట్లో నా రెమ్యూనరేషన్ రోజుకి 3500, ఆ తర్వాత లక్షల్లోనే నేను రెమ్యూనరేషన్ తీసుకున్నాను అని లయ అయితే చెప్పుకొచ్చారు.. నేటి హీరోయిన్స్ కోట్లలోనే పారితోషకం తీసుకుంటున్నారు. కాబట్టి నాకు కూడా ఆ రేంజ్ లోనే ఇప్పుడు రెమ్యూనరేషన్ ఇవ్వచ్చు కానీ, రెమ్యూనరేషన్ కంటే కూడా మనం మంచి దరి చేసుకొని మంచి క్యారెక్టర్స్ లో నటించాలి అనేది నా ఆలోచన అని లయ మాట్లాడారు..


నితిన్ ..సోదరి గా ..లయ 

ఇక లయ మూడు నంది అవార్డులను గెలుచుకున్నారు. ఈమె నటించిన సినిమాలలో, స్వయంవరం, ప్రేమించు హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ, పెళ్ళాంతో పనేంటి, దేవుళ్ళు, గెలుపు, కోదండరాముడు, నేను పెళ్ళికి రెడీ, వంటి చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. మరోసారి ఈమె మూవీస్ లోకి రావడంతో ఆమె ఫ్యాన్స్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. తమ్ముడు మూవీలో లయ చాలా రోజుల తర్వాత నటిస్తున్నారు. ఈ మూవీలో సప్తమి గౌడ, వర్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Shruti Haasan: శృతి హాసన్ ని రంగంలోకి దింపిన నవీన్.. ఇంతకి ఏం చేసిందో చూడండి!?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×