BigTV English

Meera Chopra Wedding Photos: 40 ఏళ్ల లేటు వయసులో ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న మీరా చోప్రా.. ఫొటోలు వైరల్!

Meera Chopra Wedding Photos: 40 ఏళ్ల లేటు వయసులో ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న మీరా చోప్రా.. ఫొటోలు వైరల్!
meera chopra
meera chopra

Meera Chopra Wedding Photos: సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు సహజమే. సినిమా చేస్తున్నప్పుడే హీరో హీరోయిన్ ఏదో ఒక టైంలో కనెక్ట్ అవుతుంటారు. ఇక అక్కడ మొదలైన వారి పరిచయం ఎన్నో ఏళ్ల ప్రేమాయణం తర్వాత పెళ్లి పీటలెక్కుతుంటారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటీలు పెళ్లి చేసుకున్నారు.


ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని వివాహమాడింది. ఇప్పుడు మరో హీరోయిన్ పెళ్లి చేసుకుని అందరికీ సర్ప్రైజ్ అందించింది. టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్‌కి జోడీగా బంగారం సినిమాలో నటించిన మీరా చోప్రా తాజాగా తన ప్రియుడు వ్యాపారవేత్త రక్షిత్‌ కేజ్రీవాల్‌ని పెళ్లి చేసుకుంది.

జైపూర్‌లో ఈ లవ్ కపుల్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అందులో మీరా చోప్రా రెడ్ కలర్‌ లెహంగాలో చాలా క్యూట్ అండ్ స్వీట్‌గా ఉంది. అలాగే రక్షిత్ ఐవరీ షేర్వానీలో కనిపించి కనువిందు చేశాడు.


Also Read: అసభ్యకరంగా రష్మిక మరో డీప్‌ఫేక్ వీడియో.. తనకే ఎందుకు ఇలా జరుగుతోంది..

కాగా ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా మాదిరిగానే వారి కజిన్ మీరా చోప్రా కూడా తన పెళ్లిని రాజస్థాన్‌లో జరుపుకుంది. ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు మరికొంత మంది సన్నిహితులు, వ్యాపార రంగానికి చెందిన కొందరు ప్రముఖుల హాజరయ్యారు.

కాగా మీరా చోప్రా 2005లో ఎస్‌జె సూర్యకి జోడీగా అన్బే అరుయిరే అనే చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘బంగారం’ మూవీలో హీరోయిన్‌గా నటించింది.

Also Read: Rashmika Mandanna’s Deepfake video: రష్మిక మందన్న మరో డీప్‌ఫేక్ వీడియో.. అసభ్యకరంగా.. రష్మికకే ఎందుకు ఇలా..?

ఈ మూవీ తర్వాత తెలుగులో ‘వాన’ సినిమాలో నటించింది. ఈ మూవీకి గానూ అద్భుతమైన క్రేజ్‌ను అందుకుంది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అనంతరం ఈ బ్యూటీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్, సెక్షన్ 375లో నటించింది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×