Shoaib Akhtar on Laxmipati Balaji: పాకిస్తాన్ జట్టుకు చెందిన డేంజర్ ఆటగాడు షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ప్రపంచ అగ్రస్థాయి బ్యాటర్లను గడగడ వనికించాడు షోయబ్ అక్తర్. ఈ పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ వేసే ప్రతి బంతి 150 కిలోమీటర్ల వేగంతో.. మెడ పైనుంచి దూసుకు వెళ్తుంది. యార్కర్ వేస్తే వికెట్లు విరగాల్సిందే. పొరపాటున బ్యాట్స్మెన్.. చేతికి లేదా కాళ్లకు బంతి తాకితే… దద్దులు రావాల్సిందే. అంతటి భయంకరమైన ఆటగాడు షోయబ్ అక్తర్. అయితే అలాంటి షోయబ్ అత్తర్ ను… మన భారత ఆటగాడు… టార్చర్ చేశాడు.ఇప్పటివరకు షోయబ్ అక్తర్ బౌలింగ్లో వికెట్ పడని… ఒకే ఒక్క ఆటగాడు ఇతడే కావడం విశేషం. అతను ఎవరో కాదు టీమిండియా మాజీ క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ. లక్ష్మీపతి బాలాజీ గురించి… 1990 కిడ్స్ కు బాగా తెలుస్తుంది.
Also Read: Rohit Sharma Poster In Pakistan: పాకిస్తాన్ లో రోహిత్ శర్మ 50 అడుగుల కటౌట్.. ఆడు మగాడ్రా బుజ్జి ?
మనిషి చూడడానికి కాస్త నలుపుగా ఉన్న.. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్. అప్పట్లో ఆల్రౌండర్ పాత్ర కూడా పోషించాడు లక్ష్మీపతి బాలాజీ. అయితే పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అత్తర్… బౌలింగ్ లో ప్రతిసారి సిక్సులు బాదేవాడు లక్ష్మీపతి బాలాజీ. మెడ వరకు బంతులు వేసినా కూడా… స్టేట్ సిక్స్ కొట్టగల సత్తా ఉన్న ప్లేయర్. ఇప్పటి వరకు… లక్ష్మీపతి బాలాజీని ( Laxmipati Balaji ) అవుట్ కూడా చేయలేకపోయాడు షోయబ్ అక్తర్. ఈ విషయం ఇప్పటికీ తనకు నిద్ర లేకుండా చేస్తుందని ఆ పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ అక్తర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. గతంలో షోయబ్ అక్తర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తనకు అగ్ని పరీక్షలా మారింది ఒకే ఒక్క ప్లేయర్ అతడు… లక్ష్మీపతి బాలాజీ అంటూ వ్యాఖ్యానించాడు.
ఇప్పటివరకు తనను నేను అవుట్ చేయలేకపోయాను… వీరేంద్ర సెహ్వాగ్ అలాగే సచిన్ టెండూల్కర్ లాంటి ప్లేయర్లను.. ఎన్నోసార్లు పెవిలియన్కు పంపించాను అని తెలిపాడు. కానీ… ఇప్పటి వరకు లక్ష్మీపతి బాలాజీని.. అవుట్ చేయలేదని బాధ నన్ను వేధిస్తోంది. నా బౌలింగ్ లో ఖచ్చితంగా సిక్స్ కొట్టే మొనగాడు అతడొక్కడే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్. నేను మెడ వరకు.. బంతులు వేసిన సిక్స్ కొట్టే సత్తా ఉన్న ప్లేయర్ అతడు ఒక్కడే అంటూ తెలిపారు. లక్ష్మీపతి బాలాజీ నాకు పీడకల అని షోయబ్ అక్తర్ వివరించారు.
లక్ష్మీపతి బాలాజీ తన బౌలింగ్లో సిక్స్ కొడితే… బ్యాటు ఎక్కడికక్కడ విరిగిపోయిందని గుర్తు చేశాడు. అలాంటి ఆటగాన్ని తాను ఇప్పటివరకు చూడలేదని లక్ష్మీపతి బాలాజీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ప్రారంభానికి మరో నాలుగు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో… పాకిస్తాన్ వర్సెస్ ఇండియాకు సంబంధించిన సంఘటనలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోని లక్ష్మీపతి బాలాజీ అలాగే పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ అక్తర్ కు సంబంధించిన సంఘటనలు కూడా తెరపైకి వచ్చాయి. అవే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఫిబ్రవరి 23వ తేదీన టీమిడియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య కీలక ఫైట్ ఉండనుంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">