BigTV English
Advertisement

Sai Pallavi : సీతమ్మ దారి తప్పుతుందా…? మళ్లీ ఇలాంటి సినిమాకు సైన్ చేసింది ఏంటి..?

Sai Pallavi : సీతమ్మ దారి తప్పుతుందా…? మళ్లీ ఇలాంటి సినిమాకు సైన్ చేసింది ఏంటి..?

Sai Pallavi : టాలీవుడ్ డాన్స్ క్విన్ సాయి పల్లవి 2017లో మలయాళ సినిమా ప్రేమతో తన కెరీర్ ని ప్రారంభించింది. ప్రతి సినిమాలోనూ తన నటన, డాన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ని అందుకున్న సాయి పల్లవి ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె బాలీవుడ్ లో రామాయణం సినిమాలో సీత క్యారెక్టర్ లో నటిస్తుంది. ఆమె ప్రతి సినిమాలో తన పాత్రను ఎంపిక చేసుకునే విధానం అభిమానులకు నచ్చుతుంది. తాజాగా ఆమె నెక్ట్ ఎంచుకున్న పాత్ర గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. అది తెలుసుకున్న అభిమానులు నిజమా కాదా అని ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆ సంగతి ఏంటో చూద్దాం..


అలాంటి పాత్రలో సాయి పల్లవి ..

ఇటీవల సాయి పల్లవి, నాగచైతన్యతో కలిసి నటించిన సినిమా థండెల్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ ని సాయి పల్లవి ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం సాయి పల్లవి హిందీలో రామాయణం సినిమాలో సీత క్యారెక్టర్ లో నటిస్తున్నారు. శింబు సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు సినిమాల షూటింగ్ వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మ త్వరలో ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు త్వరలో ఓ లేడీ ఓరియంటెడ్ కథ ను సిద్ధం చేసి హీరోయిన్ కోసం చూస్తున్నారుట. ఆ సినిమాలో సాయి పల్లవి కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.  లేడి ఓరియంట్ మూవీస్ తెలుగు లో చాల సినిమాలు వచ్చాయి.కానీ సాయి పల్లవి ఇలాంటి క్యారెక్టర్ లో నటించటం ఇదే మొదటి సారి. ఇప్పుడు ఈమె గురించి వచ్చిన ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో అభిమానులు ఇప్పటివరకు సాయి పల్లవి వెళ్తున్న జోనర్ లో కాకుండా కొత్తగా లేడీ ఓరియంటెడ్ అంటూ రూటు మారుస్తున్నారు అని, సీతమ్మ దారి తప్పుతుందా ఇలాంటి సినిమాలకు సైన్ చేస్తుందా ఏంటి అని కామెంట్ చేస్తున్నారు. దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.


డాన్స్ క్వీన్ గా గుర్తింపు ..

టాలీవుడ్ లో వివాదాలకు దూరంగా ఉండే సాయి పల్లవి డాక్టర్ చదువుతున్న టైం లోనే అనుకోకుండా సినిమాలలోకి వచ్చారు. తొలి సినిమా ఫిదా తో తెలుగులో సక్సెస్ ని అందుకుంది. తర్వాత వచ్చిన నాని హీరో గా  మిడిల్ క్లాస్,  ధనుష్ తో మారి 2,రానా తో విరాటపర్వం, నాగచైతన్య తో థండెల్ వంటి సినిమాలలో నటించి సక్సెస్ ని అందుకున్నారు. సాయి పల్లవి డాన్స్ తో ప్రతి సినిమాలో మెప్పిస్తారు.మారి 2 లో రౌడీ బేబీ అనే పాటలో డాన్స్ కు డాన్స్ క్వీన్ అంటూ ఫిదా అయ్యారు  అభిమానులు. తండేల్ ఘనవిజయం సాధించిన ఈ జంట మరోసారి జతకట్టనున్నట్లు సమాచారం. మరిన్ని వైవిధ్యమైన పాత్రను ఎంచుకొని అద్భుతమైన సినిమాలలో నటించాలని కోరుకుందాం.

Actress Anjali : ప్రెగ్నెంట్ అంటూ భర్తకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన మొగలి రేకులు నటి… భర్త రియాక్షన్ ఏంటంటే..?

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×