Actress Shraddha Srinath coments on casting couch: మలయాళంలో వచ్చిన కోహినూర్ మూవీతో సినిమాలలో ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా శ్రీనాథ్. కన్నడలో వచ్చిన యూ టర్న్ మూవీతో ఫిలిం ఫేర్ అవార్డును కూడా దక్కించుకుంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన శ్రద్ధ శ్రీనాథ్ తెలుగులో తొలిసారి హీరో నాని పక్కన జర్సీ మూవీలో నటించింది. అయితే గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉండే శ్రద్ధా తెలుగు సినిమాలపై అంతగా శ్రద్ధపెట్టలేదనిపిస్తోంది. చాలా గ్యాప్ తీసుకుని వెంకటేష్ తో కలసి సైంధవ్ మూవీలో కనిపించింది. ప్రస్తుతం దేశంలోనే సంచలనం కలిగిస్తోంది మలయాళంలో హేమ కమిటీ నివేదిక. ఇతర సినిమా రంగాలపైనా ఆ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. తమిళ, తెలుగు రంగాలతో సహా టీవీ సీరియల్స్ , రాజకీయ రంగంలోనూ లైంగిక వేధింపులపై కమిటీ వేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా వెటరన్ నటులు బయటకొచ్చి తమకు జరిగిన అవమానాలపై స్పందిస్తున్నారు.
ఆ అవకాశం ఇవ్వను
సమంత కూడా టాలీవుడ్ కు సంబంధించి ఓ మహిళా కమిటీని వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమంత ప్రతిపాదనకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. అయితే కాస్త ఆలస్యంగా అయినా జర్సీ భామ శ్రద్ధా శ్రీనాథ్ హేమ కమిటీ నివేదికపై స్పందించారు. తనవరకూ తాను చాలా జాగ్రతగా సమాజంలో ఉంటానని..ఎదుటివారికి ఛాన్స్ ఇవ్వనని అంటున్నారు శ్రద్ధా శ్రీనాథ్. తాను కూడా మలయాళ సినిమాలలో కథానాయికగా చేశానంటున్నారు. అయితే తనకు ఇలాంటి వేధింపుల సమస్య ఏనాడూ రాలేదని తనకు ఎనిమిదేళ్ల వయసు నుంచే సమాజం పట్ల, మగవారి పట్ల ఖచ్చితంగా ఉండేలా జీవిత పాఠాలు నేర్చుకున్నానని అంటున్నారు. ఔట్ డోర్ షూటింగులప్పుడు మహిళా నటులకు చాలా అసౌకర్యంగా ఉంటుందని, బాహాటంగా వస్త్రాలు మార్చుకోవడానికి ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు. మహిళలకు కనీస అవసరాలు గుర్తించేలా నిర్మాతలు చూసుకోవాలి.
Also Read: మహేష్ బాబు సినిమా మాల్స్ కు జాతీయ స్థాయి గుర్తింపు
వారిపై చర్యలు తీసుకోవాలి
రెమ్యునరేషన్ ఇస్తున్నాం అంటూ వారి ప్రాథమిక అవసరాలు గుర్తించకపోతే ఎలా అంటున్నారు శ్రద్ధా శ్రీనాథ్. హేమ కమిటీ నివేదికను చూసి షాక్ అయ్యానని అంటున్నారు. క్యాస్టింగ్ కౌచ్ బాధితులు ఇంతమంది ఉన్నారా అనిపిస్తోందని అన్నారు. తనకు సంబంధించి ఇలాంటి సమస్యను ఏనాడూ ఎదుర్కోలేదని..అలాటి అవకాశం ఎదుటివారికి తాను ఇవ్వనని అంటున్నారు శ్రద్ధా శ్రీనాథ్. మహిళలపై ఇలాంటి వేధింపులు ఆగాలంటే ఉన్నతాశయాలు కలిగిన సంస్థలు రావాలని..సినిమా రంగంలోకి వచ్చే మహిళలను చీఫ్ గా చూసే సంస్థలను నిషేధించాలని అంటున్నారు శ్రద్ధా శ్రీనాథ్.