BigTV English

Manchu Vishnu: విష్ణు ఆర్ట్ కలెక్షన్ విలువ అన్ని కోట్లా..అలాంటి పిచ్చి కూడా ఉందా?

Manchu Vishnu: విష్ణు ఆర్ట్ కలెక్షన్ విలువ అన్ని కోట్లా..అలాంటి పిచ్చి కూడా ఉందా?
Advertisement

Manchu Vishnu: మంచు విష్ణు ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. 10 సంవత్సరాల తర్వాత తన కల నెరవేరబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం ఈయన ఎంతో కష్టపడుతూ, వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. కన్నప్ప సినిమా(Kannappa Movie) జూన్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలను పెంచుతూ ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మంచు విష్ణు (Manchu Vishnu)సినిమా విశేషాలు మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.


కోట్ల విలువ..

తాజాగా మంచి విష్ణు హాబీ గురించి తెలియజేశారు. తనకు ఆర్ట్ అంటే చాలా ఇష్టమని, తన దగ్గర కోట్ల విలువ చేసే ఆర్ట్ కలెక్షన్(Art Collection) ఉందని తెలిపారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు వారికి ఏదైనా ఇష్టమైతే ఎంత ఖరీదైన వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగా మంచు విష్ణుకి కూడా ఆర్ట్ అంటే చాలా ఇష్టం కావడంతో ఎన్నో రకాల పెయింటింగ్స్ లక్షలు ఖర్చు చేసే కొనుగోలు చేశానని తెలిపారు. 2014 సంవత్సరంలో బాంబే నుంచి ఒక ఆర్టిస్టును పిలిపించి పద్మావతి అమ్మవారి పెయింటింగ్ చేయించాను ఆ పెయింటింగ్ వేయడం కోసం ఆమెకు మూడు లక్షల వరకు డబ్బులు ఇచ్చాను అని తెలిపారు.


మోహన్ బాబు యూనివర్సిటీ…

 

ప్రస్తుతం ఆ పెయింటింగ్ విలువ రెండు కోట్ల వరకు ఉంది అంటూ మంచు విష్ణు తెలిపారు… ఇక తాను కలెక్ట్ చేసిన ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా మోహన్ బాబు యూనివర్సిటీలోని లైబ్రరీలో ఏర్పాటు చేశానని తెలిపారు. ఇలా ఆ లైబ్రరీలో ఉన్నటువంటి  ఆర్ట్ కలెక్షన్ సుమారు 25 కోట్ల రూపాయల విలువ చేస్తుంది అంటూ ఈ సందర్భంగా విష్ణు తెలిపారు. ఇలా ఖరీదైన ఆర్ట్ కలెక్షన్ మొత్తం తన దగ్గర ఉందని విష్ణు చెప్పడంతో మీకు పెయింటింగ్ పిచ్చి కూడా ఉందా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ పెయింటింగ్స్ తాను వేలంపాటలో కూడా పెడతానని విష్ణు తెలిపారు.

ఇలా పెయింటింగ్స్ వేలం పాట వేసి ఆ వచ్చిన డబ్బులతో ఒకరిని దత్తత తీసుకొని ఆ డబ్బుతో వారిని చదివిస్తాను అంటూ ఈ సందర్భంగా మంచు విష్ణు ఎవరికి తెలియని ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.  ఇలా పేద విద్యార్థులను దత్తత తీసుకొని వారి చదువు బాధ్యతలు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో మంచు విష్ణు పట్ల అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కన్నప్ప సినిమా విషయానికొస్తే ఈ సినిమా భక్తకన్నప్ప జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శివయ్య పై తన భక్తిని  కన్నప్ప ఎలా బయటపెట్టారనే కథ ఆధారంగా ఈ చిత్రం రాబోతుంది. ఇక జూన్ 27వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా మంచు విష్ణుకి ఏ విధమైనటువంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సింది. ఇక ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా సొంత నిర్మాణంలోనే మోహన్ బాబు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Related News

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Big Stories

×