Kalpika Ganesh : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. వారిలో కల్పిక గణేష్ కూడా ఒకరు. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ్ సినిమాలు కూడా చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది కల్పిక. ఇకపోతే తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కల్పికకు మంచి పేరు తీసుకుని వచ్చింది. అలానే సీత ఆన్ రోడ్ అనే సినిమాలో కూడా కల్పిక మంచి పాత్రను పోషించింది. సాఫీగా సాగుతున్న కెరియర్లో ఒడిదొడుకులు రావడం అనేది కామన్ గా జరుగుతుంది. ఈమె జీవితంలో కూడా కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి.
అభినవ్ తో కాంట్రవర్సీ
రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలామంది టాలెంటెడ్ నటులు ఎంట్రీ ఇచ్చారు. అందులో ప్రియదర్శి, అభినవ్, రాహుల్ రామకృష్ణ వంటి నటులు కూడా ఉన్నారు. ఇక అభినవ్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నగరానికి ఏమైంది సినిమా తోని మంచి గుర్తింపు సాధించుకొని తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకున్నాడు అని చెప్పొచ్చు. అలానే మంచి అవకాశాలు కూడా పొందుకొని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టర్ గా సెటిల్ అయిపోయాడు. అయితే ఒక తరుణంలో కల్పికా గణేష్ మరియు అభినవ్ కు సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన వాగ్వాదం జరిగింది.
కల్పికా పబ్ ఇష్యూ
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రిజం పబ్‌లో హీరోయిన్ కల్పికపై దాడి జరిగింది. బర్త్‌డే కేక్ విషయంలో కల్పిక, పబ్ నిర్వాహకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వాగ్వాదం తీవ్రమైన నేపథ్యంలో పబ్ సిబ్బంది కల్పికపై దాడికి దిగారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ దర్యాప్తులో తెలియని విషయం ఏమిటంటే తాను ఇంస్టాగ్రామ్ లో వీడియో పెట్టడానికి కారణం కేవలం తన ఫాలోవర్స్ ను పెంచుకోవడమే ఉద్దేశం అంటూ చెప్పుకొచ్చింది. పోలీసులు దర్యాప్తులో ఈ విషయం తేలినట్టు సమాచారం వినిపిస్తుంది. దీని గురించి పోలీసుల అధికారికంగా ప్రకటించనున్నారు.
https://x.com/ChotaNewsApp/status/1928841363690328109?t=j0DLh-4Zt9iNuZBN9DXaiw&s=08