BigTV English
Advertisement

Pushpa 2 Collections : అల్లు అర్జున్ అరెస్టు తర్వాత… పుష్ప 2 కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?

Pushpa 2 Collections : అల్లు అర్జున్ అరెస్టు తర్వాత… పుష్ప 2 కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?

Pushpa 2 Collections : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది. 9 రోజుల్లోనే భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. 1200 కోట్ల గ్రాస్ ను ఇప్పటివరకు రాబట్టిందని తెలుస్తుంది.. ఈ వీకెండ్ ఇంకాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ తో పాటు సినీ ట్రేడ్ వర్గాలు కూడా అనుకుంటున్నారు. 2000 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని అంచనా వేస్తున్న సమయంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు ముఖ్య కారణం ఈయనే అని పోలీసులు నిన్న ఆయనను అరెస్ట్ తన నివాసం వద్దే అరెస్ట్ చేశారు. అయితే హైకోర్టు విచారణ అనంతరం ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది. ఇప్పుడే ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు.. అల్లు అర్జున్ అరెస్ట్ పుష్ప 2 కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుందా? నిన్న కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది ఆసక్తిగా మారింది. మరి తొమ్మిదో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం..


అల్లు అర్జున్ అరెస్ట్ పుష్ప 2 పై ఎఫెక్ట్ అవుతుందా..? 

పుష్ప 2 విడుదల సమయంలో సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. మహిళ మృతి ఘటనలో అల్లు అర్జున్ అరెస్టయిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ విధించగా అటు అల్లు అర్జున్ హైకోర్టు లో వేసిన పిటిషన్ విచారణ అనంతరం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 13 గంటల హైడ్రామాకు తెర దించుతూ ఆయనను జైలు అధికారులు ఈ రోజు ఉదయం రిలీజ్ చేశారు. జైలు వెనుక గేటు నుంచి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ విడుదల నేపథ్యంలో చంచల్ గూడ జైలు దగ్గరకు అల్లు అరవింద్, అల్లు అర్జున్ మామయ్య, కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ సన్నిహితులు, అభిమానులు చేరుకున్నారు.. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఆయన అరెస్ట్ పుష్ప 2 కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుందా అని టెన్షన్ పడుతున్నారు. మరి కలెక్షన్స్ ఎలా ఉన్నాయాంటే..


పుష్ప 2 కలెక్షన్స్..

పుష్ప 2కు రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల షేర్‌ను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించాయి మార్కెట్ వర్గాలు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11000 స్క్రీన్‌లలో డిసెంబర్ 5న రిలీజైంది పుష్ప 2 ది రూల్. ఫస్ట్ వీక్‌లోనే ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసుకుంది. తొమ్మిదోవ రోజు కలెక్షన్స్ కాస్త తగ్గినట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడమే దానికి కారణం అని తెలుస్తుంది. తమ హీరో అరెస్ట్ అయ్యారని తెలుసుకున్న ఫ్యాన్స్ జైలు దగ్గరకు భారీగా చేరుకున్నారు. దాంతో థియేటర్లు ఖాళీ ఉన్నాయని తెలుస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం వరకు బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే ఫస్ట్ షో, సెకండ్ షోలకు సాలీడ్ టికెట్స్ బాగా తెగాయట. ప్రపంచవ్యాప్తంగా 9వ రోజు ఈ సినిమా రూ.42 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్లు తెలుస్తుంది. మరి ఈ వీకెండ్ ఏ మాత్రం కలెక్షన్స్ ను అందుకుంటుందో చూడాలి..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×