BigTV English

Chef Mantra Project K: సెలబ్రిటీలతో సుమ వంటలు.. మళ్ళీ కలిసిన పృథ్వి, విష్ణుప్రియా.. కానీ.. ఓ ట్విస్ట్

Chef Mantra Project K: సెలబ్రిటీలతో సుమ వంటలు.. మళ్ళీ కలిసిన పృథ్వి, విష్ణుప్రియా.. కానీ.. ఓ ట్విస్ట్

Chef Mantra Project K: బుల్లితెర క్వీన్ సుమ.. సరికొత్త షోతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. ఈసారి పలువురు సెలబ్రిటీలతో కలిసి వంటలు చేయించనుంది. కానీ ఆ వంటలతో పాటు తంటాలు కూడా ఎదుర్కుంటోంది. సుమ హోస్ట్ చేస్తున్న ఈ కొత్త షో పేరే ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె’. నేరుగా ఆహాలో ప్రారంభం కానున్న ఈ కొత్త షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఇందులో సుమ హోస్ట్ కాగా యాక్టర్ కమ్ చెఫ్ అయిన జీవన్ జడ్జిగా వ్యవహరించనున్నారు. పదిమంది సెలబ్రిటీలు 5 జంటలుగా విడిపోయి తమ వంటలతో అలరించనున్నారు. ఇక ఈ షోకు పృథ్వి, విష్ణుప్రియా జంటగా రావడం హైలెట్‌గా నిలిచింది.


దీపిక గ్రాండ్ ఎంట్రీ

ముందుగా చెఫ్ మంత్రలో వంట చేసే సెలబ్రిటీలుగా అమర్‌దీప్, అర్జున్ కలిసి వచ్చారు. రాగానే ‘పుష్ప 2’ రిఫరెన్స్‌లు మొదలుపెట్టారు. వారి తర్వాత మరొక జంటగా దీపిక రంగరాజ్, సమీరా భరద్వాజ్ ఎంటర్ అయ్యారు. ‘బ్రహ్మముడి’ సీరియల్‌లో కావ్య పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది దీపిక. బుల్లితెర షోలలో తను ఎక్కడ కనిపిస్తే అక్కడ అల్లరి తప్పదు. అలాంటి దీపిక చెఫ్ మంత్రలో కూడా అడుగుపెట్టి అల్లరి స్టార్ట్ చేసింది. తను డ్యాన్స్‌తోనే పాలు తాగాను, కుకింగ్ చేశాను, దోశ వేశాను అని చెప్పగానే అవన్నీ కుకింగ్‌లో చేయాలంటూ తనకు కౌంటర్ వేసింది సుమ. ఆ తర్వాత పృథ్విరాజ్, విష్ణుప్రియా ఒక కపుల్‌గా ఎంటర్ అయ్యారు.


రోటీ పచ్చడి అంటే?

పృథ్విరాజ్, విష్ణుప్రియా జంటగా ఎంటర్ అవ్వగానే వారి ఎంట్రీ సాంగ్‌పై పంచులు వేసింది సుమ. వారేదో రొమాంటిక్ సాంగ్‌తో ఎంట్రీ ఇస్తారేమో అని ఎదురుచూసిన ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు. తెలియకుండా ఆటోమేటిక్ స్టవ్‌పై కూర్చున్నాడు అర్జున్. అది అంటుకుంటుంది అని చెప్పగానే అందరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రిత, యాదమ్మ రాజు జంటగా వచ్చారు. రోటీ పచ్చడి అంటే ఏంటి అని సుప్రితను అడగగా.. రోటీతో నంజుకొని తినే పచ్చడి అని సమాధానమిస్తుంది సుప్రిత. దానిని కంటిన్యూ చేస్తూ దోశతో తింటే దోశకాయ పచ్చడి అని చెప్పింది దీపిక. చివరి జంటగా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రశాంత్, తన పార్ట్‌నర్ వచ్చారు. జడ్జిగా జీవన్ కూడా ఎంటర్ అవ్వడంతో అసలు ఆట మొదలయ్యింది.

Also Read: శ్రీవిష్ణు కొత్త మూవీ టైటిల్ ఫిక్స్.. లుక్‌తో పాటు ఆకట్టుకుంటున్న టీజర్..

బోండాలతో పోటీ

జోక్స్‌ను ఎంజాయ్ చేస్తాను కానీ కుకింగ్ విషయంలో చాలా సీరియస్‌గా ఉంటాను అంటూ రాగానే తన గురించి పరిచయం చేసుకున్నారు జీవన్. ముందుగా సెలబ్రిటీలకు మైసూరు బోండాలు చేయమని పోటీపెట్టారు జీవన్. మైసూరు బోండాలు చేయడానికి వారంతా తెగ కష్టపడ్డారు. మధ్యమధ్యలో ఒకరి వంటపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూ సరదాగా ఆటలు ఆడుకున్నారు. దీపికా, సమీరా చేసిన బోండాలు తినే ముందు ఇదే తన లాస్ట్ కాల్ అని రాజీవ్ కనకాలకు కాల్ చేసిన చెప్పింది సుమ. విష్ణుప్రియా, పృథ్వి చేసిన బోండాలు తినగానే జీవన్, సుమ నోట మాట రాలేదు. మైసూరు బోండాలతో మాత్రమే కాదు పూతరేకుల విషయంలో కూడా సెలబ్రిటీలు ఎన్నో ప్రయోగాలు చేసి అందరినీ నవ్వించారు. ఇక ఈ ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె’ షో ప్రతీ గురువారం సాయంత్రం 7 గంటలకు ఆహాలో స్ట్రీమ్ కానుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×