Kiran abbavaram New Movie : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కష్టపడితే ఫలితం వస్తుంది అని నిరూపించిన చాలామంది నటులు ఉన్నారు. వారిలో ఇప్పటికీ చాలామందికి గుర్తొచ్చే మొదటి పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత నటుడుగా కొన్ని సినిమాలు చేసి ఈరోజు మాస్ మహారాజా అయిపోయాడు. ప్రస్తుతం నాని కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టి నేను స్టార్ హీరో అయిపోయాడు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వలన మంచి గుర్తింపు సాధించుకున్న చాలామంది నటులుగా రాణిస్తున్నారు. అలానే షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్స్ తో వచ్చిన చాలామంది దర్శకులు ఈరోజు సినిమాలు చేస్తున్నారు. అలా షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన హీరో కిరణ్ అబ్బవరం.
రాజావారు రాణి గారు ఎంట్రీ
ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసిన తర్వాత రవి కిరణ్ కోలా దర్శకుడుగా పరిచయమైన రాజా వారు రాణి గారు సినిమాతో హీరోగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత ఎస్సార్ కళ్యాణమండపం అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో కేవలం నటించడం మాత్రమే కాకుండా తనలో ఉన్న రచయితను కూడా బయటకు తీసి చాలామందిని సప్రైజ్ చేశాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. దీని తర్వాత కిరణ్ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. వరుసగా డిజాస్టర్ సినిమాలు పడుతూనే ఉన్నాయి. ఇక కిరణ్ అభవారం టైం కూడా అయిపోయింది అని దాదాపు అందరూ ఒక స్థాయి నమ్మకానికి వచ్చేసారు.
“క” సినిమాతో కం బ్యాక్
అయితే కిరణ్ అబ్బవరం కెరియర్లో “క” సినిమా యూనిక్ కాన్సెప్ట్ గా వచ్చి మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాతో కిరణ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం కిరణ్ కి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా దిల్ రూబా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కిరణ్ ఇప్పుడు మరో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. కిరణ్ అబ్బవరం కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో విశాఖపట్నంలో షూట్ చేశారు.త్వరలోనే ఈ వీడియో బయటకు రానుంది. రవి నంబూరి దర్శకుడు. ‘బేబీ’ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తీసిన మాస్ మూవీ మేకర్స్ తో కలసి అమృత ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు.
Also Read : Prabhas Seenu : నాకు అవకాశాలు రావట్లేదు అని ప్రభాస్ అలా చెప్పారు