Hollywood:ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కంటతడి పెట్టిస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు మరో నటుడి మృతి అభిమానుల చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆయన ఎవరో కాదు వాల్ కిల్మర్ (Val kilmer). హాలీవుడ్లో ‘టాప్ సీక్రెట్’, ‘బ్యాట్ మ్యాన్’, ‘టాప్ గన్’ తదితర చిత్రాలలో నటించి సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న నటుడు వాల్ కిల్మర్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈయన అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఏప్రిల్ 1న తుది శ్వాస విడిచారు. న్యూమోనియాతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఈయన ఆరోగ్యం బాగా క్షీణించడంతోపాటు సుదీర్ఘకాలంగా గొంతు క్యాన్సర్ తో కూడా బాధపడుతున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.
క్యాన్సర్ తో పాటు న్యూమోనియాతో బాధపడ్డ వాల్ కిల్మర్..
అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ప్రముఖ మీడియా సంస్థలు కూడా వాల్ కిల్మర్ మరణ వార్తను ధ్రువీకరించాయి. ఆయన ఆరోగ్య స్థితిపై మొదట ఆందోళన అంటూ వార్తలు రాగా.. కొన్ని గంటల్లోనే మృతి చెందినట్లు ధ్రువీకరించాయి. 65 సంవత్సరాల వయసులో మృతి చెందిన కిల్మర్ గత రెండేళ్ల క్రితం కూడా సినిమాలు చేశారు. 2022లో వచ్చిన ‘టాప్ గన్ : మావెరిక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత మళ్లీ వెండితెరిపై కనిపించలేదు. క్యాన్సర్ చికిత్స తీసుకున్న ఈయన .. దాని నుంచి కోలుకున్నట్లు అనిపించినా.. మళ్లీ న్యుమోనియా వెంటపడడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొని తృది శ్వాస విడిచారు.
Divya Bharathi: జీ.వి.ప్రకాష్ తో డేటింగ్.. రూమర్స్ పై స్పందించిన దివ్యభారతి..!
వాల్ కిల్మర్ కెరియర్..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, సినీ ప్రేమికులు, ఆయన అభిమానులు ప్రత్యేకించి బ్యాట్ మాన్ క్యారెక్టర్ అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈయన కెరియర్ విషయానికి వస్తే.. 1959 డిసెంబర్ 31న జన్మించిన ఈయన 1984లో వచ్చిన ‘టాప్ సీక్రెట్’ మూవీ తో హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే నటుడిగా ముద్ర వేసుకున్న ఈయన ఆ సినిమాతో మంచి పేరు రావడంతో ‘రియల్ జీనియస్’ సినిమాలో కూడా నటించారు. 1985లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే యూత్ ను ఒకప్పుడు విపరీతంగా అలరించిన ‘బ్యాట్ మ్యాన్’ సినిమాలో కూడా నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. లాస్ ఏంజిల్స్ లో జన్మించిన ఈయన జులియార్డ్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. మొదట్లో యానిమేషన్ సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఈయన.. ఆ తర్వాత సూపర్ హిట్ సినిమాలలో నటించారు. అలా సాల్టన్ సీ, వండర్ ల్యాండ్, రెడ్ ప్లానెట్, ది మిస్సింగ్, ఎట్ ఫస్ట్ నైట్ , సిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇంతలా తన నటనతో డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పేరు సొంతం చేసుకున్న ఈయన ఇప్పుడు మరణించడంతో అభిమానులు విచారణ వ్యక్తం చేస్తున్నారు.