Good Bad Ugly Telugu trailer: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) హీరోగా అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’.త్రిష (Trisha) హీరోయిన్గా రాబోతున్న ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న గ్రాండ్గా థియేటట్రికల్ విడుదలకు షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేయగా.. ఈ ట్రైలర్ ప్రేక్షకులలో భారీ ఉత్సాహాన్ని నింపింది. అయితే తెలుగు విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూసినా.. దీనిపై స్పష్టత ఇవ్వలేదు. కానీ తాజాగా 11:34 తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు .ఇక మధ్యాహ్నం 1:08 గంటలకు హిందీ ట్రైలర్ కూడా ప్రీమియర్ అవుతుందని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు తెలుగులో యాక్షన్ పర్ఫామెన్స్ తో అజిత్ అదరగొట్టేస్తున్నారు. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో అర్జున్ దాస్ విలన్ గా నటిస్తుండగా.. షైన్ టర్మ్ చాకో, సునీల్ (Sunil), యోగి బాబు(Yogibabu) తో పాటు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా.. జీవి ప్రకాష్ కుమార్ (GV.Prakash kumar) సంగీతం అందించారు.
వారే టార్గెట్ గా అజిత్..
హీరో అజిత్ విషయానికి వస్తే.. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా రికార్డులు నెలకొల్పే సత్తా ఉన్న హీరోగా అజిత్ పేరు సొంతం చేసుకున్నారు.ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈయన యూత్, మాస్ ఆడియన్స్ లో ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్నారు.ముఖ్యంగా ఈయన సినిమాలంటే మెంటలెక్కిపోయే ఆడియన్స్ కూడా ఎంతోమంది ఉన్నారు. అటు కోలీవుడ్ లోనే కాకుండా ఇటు టాలీవుడ్ లో కూడా అజిత్ కి భారీగా ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే చివరిగా ఆయన నటించిన చిత్రం ‘విడాముయార్చి’. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా వేరే హీరోకైతే ఇలా ఫ్లాప్ సినిమాల తాలూకు ఫలితం గట్టిగా అనుభవించేవారు. కానీ అజిత్ పై ఈ ప్లాపు ప్రభావం ఏ మాత్రం పడలేదని చెప్పాలి.
అడ్వాన్స్ బుకింగ్స్ లో ఊచకోత మొదలుపెట్టిన అజిత్ మూవీ..
ఇక ప్రస్తుతం ఈయన హీరోగా నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ రెండు రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. కొన్ని సెలెక్టెడ్ సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ స్క్రీన్ లలో మాత్రమే బుకింగ్స్ మొదలవగా.. కేవలం ఈ స్క్రీన్స్ నుండే ఈ చిత్రానికి 1800 షోలకి గానూ..6 కోట్ల 18 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్లు సమాచారం ముఖ్యంగా ఫైనల్ అడ్వాన్స్ టికెట్ సేల్స్ ముగిసే సరికి 25 కోట్ల రూపాయలకు చేరుకున్నా.. ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని , మొదటి రోజే ఒక్క కోలీవుడ్ నుండే రూ.40 కోట్ల వరకు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. మొత్తానికైతే ట్రైలర్ తోనే అంచనాలు పెంచేసిన అజిత్ ఈ సినిమాతో భారీ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
OTT Movies: ఈవారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమైన ఓటీటీ మూవీస్ ఇవే..!