Ajith Kumar : సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలి? ఏజ్ పెరిగాక దానికి తగ్గ సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా ? అనే టెన్షన్ ఉంటుంది. కానీ అలాంటి టెన్షన్ ఏమీ పెట్టుకోకుండా తాజాగా తమిళ తల అజిత్ కొత్త కెరీర్ ని ఎంచుకున్నారు. దీంతో అజిత్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా అంతర్జాతీయ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ తన సినిమా కెరియర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
అజిత్ కొత్త కెరీర్ ఇదే…
అజిత్ కుమార్ కు కార్ రేసింగ్, బైక్ రేసింగ్ వంటివి అంటే పిచ్చి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు బైక్ మీద ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టిన అజిత్ ఇప్పుడు తనకు ఇష్టమైన కార్ రేసింగ్ ను కెరియర్ గా ఎంచుకోవడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే త్వరలో జరగనున్న 24 హెచ్ దుబాయ్ 2025 ఎండ్యూరెన్స్ రేస్ లో అఫీషియల్ గా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే అజిత్ జనవరి 11 నుంచి 12 వరకు తన టీంతో కలిసి ఈ రేసులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్లో ఆయన ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఓ చిన్నపాటి ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. అందులో అజిత్ కుమార్ రేసింగ్ పై మక్కువ చాటుకుంటూనే, మరోవైపు సినిమాలకి ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అనే విషయాన్ని వెల్లడించారు.
సినిమాలకు గుడ్ బాయ్?
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రేసర్ గా మారిన అజిత్ మాట్లాడుతూ “నేను కేవలం డ్రైవర్ గానే కాకుండా జట్టు యజమానిగా కూడా మోటార్స్ స్పోర్ట్స్ ను కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నాను. రేసింగ్ సీజన్ వచ్చేవరకు నేను సినిమాలకు సైన్ చేయను. బహుశా అక్టోబర్ నుంచి మార్చి మధ్య రేసింగ్ సీజన్ ప్రారంభమయ్యే ముందు వరకు మాత్రం సినిమాల్లో నటిస్తాను. కాబట్టి అటు అభిమానులు నేను సినిమాలు మానేస్తున్నాను అని టెన్షన్ పడకుండా ఉంటారు. అలాగే ఇటువైపు నేను రేసింగ్ స్టార్ట్ అయ్యాక పూర్తిగా దీనిపై ఫోకస్ చేయగలను” అంటూ చెప్పుకోచ్చారు. మొత్తానికి ఇటు సినిమాలను వదలకుండా తనకు ఇష్టమైన రేసింగ్ ను వదలకుండా, ఇటు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టకుండా బాగానే ప్లాన్ చేసుకున్నారు అజిత్.
ఇక అదే చిట్ చాట్ లో ఇప్పటికే మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల నిర్మాణ సంస్థలు ఈ రేసింగ్ విషయంలో ఏవైనా కండిషన్స్ పెట్టాయా? అనుగుణంగా ఏవైనా మార్పులు చేర్పులు చేయమని కోరుతున్నాయా? అని అడగ్గా… “ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు చెప్పాల్సిన అవసరం లేదు” అంటూ సింపుల్ గా సమాధానం ఇచ్చారు. ఇక రీసెంట్ గా అజిత్ ఈ కార్ రేసింగ్ ప్రాక్టీస్ లోనే ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
"I don't need to be told what to do, what not to do" – Ajith Kumar opens up about his future film career🏎️ pic.twitter.com/hzt84xe7eT
— Manobala Vijayabalan (@ManobalaV) January 10, 2025