JanaSena Formation Day : జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం (JanaSena Formation Day) అత్యంత ఘనంగా జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే పిఠాపురం గతంలో ఎన్నడూ లేని విధంగా ముస్తాబయింది డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అలాగే ‘జయకేతనం’ సభకు కూడా పిఠాపురం వేదికగా మారబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఎగిరి గంతేసే అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ (Akira Nandan) లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నాడు.
జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో అకిరా నందన్ సందడి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ కు ఇప్పటి నుంచే అభిమానుల్లో భారీగా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అతను సోషల్ మీడియాలో పెద్దగా కనిపించడు. అలాగే అకిరాకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చేది కూడా చాలా అరుదు. అయినప్పటికీ అకీరాకు స్టార్ హీరో రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. ఇక ఇప్పటికే అకిరా నందన్ కుంగ్ ఫూ, కరాటేతో పాటు మ్యూజిక్, డాన్స్ లలో కూడా శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ కూడా మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావీణ్యం పొందారు. ఆయన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’, ‘తమ్ముడు’, ‘ఖుషి’, ‘బద్రి’ లాంటి సినిమాల్లో తన మార్షల్ ఆర్ట్స్ ట్యాలెంట్ ని ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. అయితే తాజాగా జరగబోతున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో అకిరా నందన్ కూడా లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నాడు. లైవ్ పెర్ఫార్మెన్స్ అనగానే డ్యాన్స్ లేదా సాంగ్స్ పాడడం లాంటివి ఏమైనా చేస్తాడేమో అనుకుంటున్నారేమో…. అస్సలు కాదు, కలరిపట్టు అనే ఏన్షియంట్ ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ పై అకిరా ఈ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
అకిరా నందన్ స్పెషల్ అట్రాక్షన్
ఇదిలా ఉండగా అకిరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ గురించి మెగా అభిమానులు ఇప్పటికే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే అకీరా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ మూవీతో సినిమాలోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఆయనను 70mm స్క్రీన్ పై చూడడాని కంటే ముందే ఇలా జనసేన ఆవిర్భావ సభ వేడుకల్లో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శిస్తూ చూడడం అన్నది నిజంగా మెగా అభిమానులకు కన్నుల పండగగా ఉంటుందని చెప్పొచ్చు. అంతేకాదు ఈ ఈవెంట్ లో ఎంతమంది ఉన్నా అకిరానే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఈ వేడుకకు వచ్చే వారికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు కేటాయించడమే కాకుండా మహిళలకు సపరేట్ గ్యాలరీలు, సౌకర్యాలు కల్పించినట్టు సమాచారం. 75 సీసీ కెమెరాలు, భారీ సంఖ్యలో ఎల్ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేసి, స్టేజ్ పై వివిధ రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్, నాయకుల ప్రసంగాలు, పార్టి ప్రస్థానంపై ఆడియో, వీడియో కథనాలు ఉంటాయని తెలుస్తోంది.