BigTV English
Advertisement

Akkineni Cousins Photo: అక్కినేని వారసులు అందరూ ఒకే ఫ్రేమ్ లో.. అదిరిపోయింది!

Akkineni Cousins Photo: అక్కినేని వారసులు అందరూ ఒకే ఫ్రేమ్ లో.. అదిరిపోయింది!

All Akkineni Cousins in one Frame: అక్కినేని హీరోలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన సామ్రాజ్యాన్ని అక్కినేని నాగార్జున.. ఆయన కుమారులు కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో అక్కినేని హీరోలు కొద్దిగా వెనకబడ్డారు. అభిమానులను పెంచుకోవడంలోనూ.. పాన్ ఇండియా లెవెల్ గుర్తింపులోనూ వారు వెనకనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు.


నాగ్ గురించి పక్కన పెడితే.. అక్కినేని కుర్ర హీరోలు అంటే.. నాగచైతన్య, అఖిల్, సుశాంత్, సుమంత్.. తమ సత్తాను చూపించడానికి వస్తున్నారు. ఇక ఈ కజిన్స్ అందరూ ఒకచోట కలిశారు అంటే ఆ సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పండగ వచ్చినా ఫంక్షన్ వచ్చినా ఇప్పటివరకు మెగా కజిన్స్ ఫోటోలు మాత్రమే వైరల్ అయ్యేవి. కానీ, మొదటిసారి అక్కినేని కజిన్స్ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. హీరో సుశాంత్ ఈ ఫోటోను షేర్ చేస్తూ కజిన్స్ కన్సర్డ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

Also Read: Godzilla x Kong The New Empire: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. కానీ..!


కజిన్స్ అందరూ కలిసి ఒక చిన్న పార్టీ చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఇందులో అక్కినేని వారసులు నాగార్జున, వెంక, నాగ సుశీల పిల్లలందరూ ఉన్నారు. నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్, సుప్రియ తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ఇక ఇప్పటికే చై తండేల్ మూవీ చేస్తున్నాడు. అఖిల్..కెజిఎఫ్ మేకర్స్ తో ఒక సినిమా చేస్తున్నాడు. సుమంత్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. సుశాంత్ ఒక పక్క హీరోగా .. ఇంకోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యాడు. ఇక సుప్రియ నిర్మాతగా మారి మంచి సినిమాలు తీస్తుంది. ఇలా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నా.. ఖాళీ సమయంలో ఇలా ఛిల్ల్ అవుతూ కనిపించారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×