Akkineni Nagarjuna: టాలీవుడ్ టాప్ ఫ్యామిలీలలో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు లెగసీని కొడుకు నాగార్జున కొనసాగిస్తున్నాడు. ఇకపోతే నాగ్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఆయన హీరోగా కాకుండా సపోర్టింగ్ రోల్స్ చేయడానికి మొగ్గు చూపుతున్నాడు. మిగతా హీరోలతో పోలిస్తే.. నాగ్, ఆయన కొడుకులు వెనుకబడ్డారని చెప్పాలి. చిరు, వెంకీ, బాలయ్య.. వారి వారసులు పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంటే.. నాగ్, అఖిల్, నాగచైతన్య ఇంకా ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు.
మొన్నటివరకు నాగ్.. ఇద్దరు కొడుకుల పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆ బాధ తీరిపోయింది. చైకి రెండో పెళ్లి చేసి హ్యాపీ అయ్యాడు. అఖిల్ కు ఆల్రెడీ అమ్మాయిని సెట్ చేశారు. త్వరలోనే వీరి పెళ్లి కూడా జరుగుతుంది. ఇక సినిమాల పరంగా కూడా చై ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. మొదటిసారి టాండేల్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు.
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తండేల్. బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు.
Samantha: నాగచైతన్య- శోభితా పెళ్లిపై తొలిసారి స్పందించిన సామ్.. అలా అనేసిందేంటి.. ?
ఈమధ్య ఈ సినిమాను ఇండస్ట్రీలో టాప్ సెలబ్రిటీస్ కు చూపించడం జరిగిందట. అందరూ చై కెరీర్ బెస్ట్ సినిమా అని చెప్పుకొచ్చినట్లు సమాచారం. ఇక తాజాగా అక్కినేని నాగార్జున సైతం తండేల్ ప్రివ్యూ చూసినట్లు టాక్ నడుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో తండేల్ సినిమా చూసి నాగ్ భావోద్వేగానికి గురయ్యాడట.
సినిమా అవుట్ ఫుట్ పై సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు కొడుకు నటనకు ఫిదా అయ్యాడట. సినిమా చాలా బావుందని, అన్ని ఎమోషన్స్ కలగలిపి తీసిన చందూను, చిత్రబృందాన్ని అభినందించినట్లు సమాచారం. ఎట్టకేలకు ఈసారి వస్తున్నాం.. కొడుతున్నాం అని నాగ్ స్టైల్లో చై చెప్పినట్లుగానే సినిమా సూపర్ అని టాక్ వచ్చేసింది. ఇక మొదటి నుంచి ఈ సినిమాపై అభిమానులు సైతం భారీ అంచనాలను పెట్టుకున్నారు.
రెండోసారి సాయిపల్లవి- చైతన్య కలిసి నటిసిన్హాడం.. కార్తికేయ 2 లాంటి హిట్ సినిమా తరువాత చందూ ఈ సినిమా చేయడం.. అది కూడా వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించడం.. ఇక డిఎస్పీ మ్యూజిక్ కోసమైనా ఈ సినిమాకు వెళ్ళాలి అనుకున్నవారు లేకపోలేదు. మరి ఇంత హైప్ తీసుకొచ్చుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.