Akkineni Nagarjuna: ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా.. పెద్దగా చదువుకోకపోయినా.. ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు అక్కినేని నాగేశ్వర రావు. అందగాడిగా, అప్పటి యువతకు నచ్చే పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు విపరీతంగా దగ్గరయ్యారు. హీరోగా తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఏఎన్ఆర్ అంటే పేరు కాదు.. ఒక బ్రాండ్ అనిపించేలా చేశారు. ఇండస్ట్రీలో అలాంటి మర్చిపోలేని నటుడి లెగసీని కాపాడడానికి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అక్కినేని కుటుంబం నుండి మూడో తరం కూడా వచ్చి నటులుగా ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తున్నారు. తాజాగా ఈ అక్కినేని కుటుంబమంతా కలిసి ప్రధాని మోడీని కలిశారు. దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీలో అక్కినేని ఫ్యామిలీ
అక్కినేని నాగేశ్వర రావు సినీ జీవితంలో ప్రేక్షకులను ఇన్‌స్పైర్ చేసే ఎన్నో అంశాలు ఉన్నాయి. అందుకే ఆయనపై ఒక పుస్తకం లాంచ్ చేయాలని అక్కినేని కుటుంబం నిర్ణయించుకుంది. ఈ బుక్ లాంచ్ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగాలనే ఉద్దేశ్యంతో కుటుంబమంతా ఢిల్లీ బయల్దేరింది. ఢిల్లీలో అక్కినేని కుటుంబం సందడి చేస్తున్న ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో బయటికొచ్చాయి. ఇక తాజాగా ప్రధానీ నరేంద్ర మోడీ ఏఎన్ఆర్ బుక్‌ను లాంచ్ చేసిన ఫోటో కూడా బయటికొచ్చింది. అందులో అక్కినేని కుటుంబానికి చెందిన ప్రతీ వారసుడు ఉన్నాడు. ముఖ్యంగా కొత్తజంట నాగచైతన్య, శోభితా ఈ ఫోటోల్లో హైలెట్ అవుతున్నారు.
అఖిల్ మిస్సింగ్
ప్రధానీ మోడీని కలవడానికి నాగార్జునతో పాటు ఆయన సతీమణి అమల కూడా ఉన్నారు. తన సోదరిలు, వారి వారసులు కూడా ఢిల్లీకి వెళ్లి మోడీని కలిశారు. నాగార్జున వారసుడు నాగచైతన్య, తన కోడలు శోభితా మాత్రం ఈ ఫోటోలో ప్రత్యేకంగా హైలెట్ అయ్యారు. ఇందులో దాదాపు అందరూ ఉన్నా కూడా ఒక్క అక్కినేని వారసుడు మాత్రం మిస్ అయ్యాడు. తనే అఖిల్. గత కొన్నాళ్లుగా అసలు అఖిల్.. ఏ ఈవెంట్‌లోనూ పాల్గొనడం లేదు. హీరోగా అక్కినేని కుటుంబం నుండి లాంచ్ అయినప్పటి నుండి అసలు అఖిల్‌కు ఒక్క హిట్ కూడా లేదు. అలా బ్యాక్ టు బ్యాక్ దాదాపు అరజడను ఫ్లాపులు ఎదుర్కున్న తర్వాత అఖిల్ అసలు బయటికి రావడమే మానేశాడు.
Also Read: ‘తండేల్’లో ఆ అంశాన్ని వాడుకోలేకపోయిన దర్శకుడు.. అంచనాలు తారుమారు..
వారే హైలెట్
ప్రధాని మోడీని కలవడం కోసం అక్కినేని ఫ్యామిలీ (Akkineni Family) అంతా ట్రెడీషినల్ డ్రెస్సుల్లో రెడీ అయ్యారు. నాగార్జున, నాగచైతన్య బ్లాక్ కుర్తా సూట్స్‌లో రెడీ అవ్వగా అమల పింక్ కలర్ కాటన్ చీరలో కనిపించారు. శోభితా.. వైల్డ్ అండ్ గోల్డ్ శారీలో అలరించింది. నాగచైతన్య (Naga Chaitanya), శోభితా (Sobhita)కు ఇటీవల పెళ్లి కావడంతో వీరిద్దరూ కలిసి ఎక్కడ కనిపించినా వెంటనే దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అలాగే ప్రధానీ మోడీని అక్కినేని కుటుంబం మొత్తం కలిసినా అందులో వీరిద్దరి గురించే ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. నరేంద్ర మోడీని కలవడంతో పాటు ఢిల్లీ పార్లమెంట్‌లోని టీడీపీ ఆఫీసుకు కూడా వెళ్లింది అక్కినేని కుటుంబం.