Thandel Movie : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య నాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించిన తాజా చిత్రం తండేల్.. భారీ అంచనాలతో ఈ మూవీ ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చైతు ఈ సినిమాలో కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రమోషన్ టైం లో మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ తో మూవీ పక్కా కమర్షియల్ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ మూవీకి మిక్సీ్డ్ టాక్ వచ్చినట్లు తెలుస్తుంది. చైతూ ఖాతాలో హిట్ పడుతుందని అనుకున్నారు అక్కినేని ఫ్యాన్స్ కానీ ఇప్పుడు నిరాశ పడుతున్నారు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వక పోవడానికి డైరెక్టర్ చేసిన ఒక చిన్న మిస్టేక్ కారణం అని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
తండేల్ మూవీ స్టోరీ..
నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తాజా చిత్రం తండేల్.. భారీ హైప్ తో నేడు థియేటర్లలోకి రిలీజ్ అయ్యింది. కానీ మూవీ రిలీజ్ కు ముందు క్రియేట్ అయినట్లు రిలీజ్ అయ్యాక అంత బజ్ లేదు. సినిమా స్టోరీ లైన్ బాగున్నా కూడా స్టోరీని కట్ చేశారు. అక్కడక్కడా ల్యాగ్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.. మత్స్యలేశం గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు చందూ మొండేటి రాసుకున్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన 22 మంది మత్స్యకారులు గుజరాత్ పోర్ట్ కు వెళ్లిన సమయంలో దారితప్పి పాకిస్థాన్ సీ వాటర్స్ వెళ్తారు. దీంతో వాళ్లని పాకిస్థాన్ అధికారులు అరెస్ట్ చేస్తారు. ఇక వాళ్లు జైలు నుంచి ఎలా బయటపడ్డారనేదే కథ.. అయితే ఈ సినిమాను దాదాపు రూ. 90కోట్లతో తెరకెక్కించినట్లు సమాచారం. అయితే మొదట్లో అనుకున్న దానికంటే ఈ సినిమా బడ్జెట్ భారీగానే పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పాకిస్థాన్ జైలు ఎపిసోడ్ తక్కేవేనని టాక్.. ఇక ఈ సీన్ ను తెరకేక్కించడంలో డైరెక్టర్ తడబడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
డైరెక్టర్ ఆ ఒక్కటి చూసింటే మూవీ హిట్ అయ్యేది..?
తండేల్‌లో… సినిమాటిక్ లిబర్టీస్ డైరెక్టర్ ఎక్కువ తీసుకున్నాడు. నిజమైన కథలో తండేల్ రాజు లెటర్ రాస్తే… వాళ్ల భార్య వద్దకు చేరడానికి కనీసం 3 నుంచి 4 నెలల టైం పట్టేది. కానీ, సినిమాలో డైరెక్ట్ ఫోన్ కాల్స్ పెట్టారు. పాక్ జైల్లో ఉంటే ఓ కానిస్టేబుల్.. హీరోకు ఫోన్ మాట్లాడు అని ఇస్తాడు. పాక్ జైల్లో అంత మంచి వాళ్లు ఉంటారా..? రియల్ తండేల్ రాజు పాక్ జైళ్లో ఉన్నప్పుడు… ఓ సారి ఇండియాలో పాక్ ఖైదీపై దాడి జరుగుతుందట. అప్పుడు పాక్ జైళ్లో ఉన్నవాళ్లు అందరూ భయపడుతూ బతికారాట. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ, ఆ రియాలిటీకి దూరంగా కొన్ని సీన్స్ డిజైన్ చేశారు.
అవే ఇప్పుడు ట్రోల్స్ కి కారణం అవుతున్నాయి.. టెక్నాలజీని వాడినా కూడా కొంచెం కవర్ చెయ్యాల్సింది.. కానీ ఇదే మిస్టేక్ సినిమాపై ప్రభావాన్ని చూపించింది. ప్రస్తుతం పర్వాలేదనే టాక్ ను అందుకుంది. ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..