BigTV English

SreeLeela: బాలీవుడ్ లో గ్రాఫ్ పెంచుకోవడానికి తగ్గిన శ్రీ లీల.. ఏమైందంటే..?

SreeLeela: బాలీవుడ్ లో గ్రాఫ్ పెంచుకోవడానికి తగ్గిన శ్రీ లీల.. ఏమైందంటే..?

SreeLeela..ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్నారు. కానీ ఇందులో ఎక్కువ మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో రాణించలేక ఫెయిల్ అవుతున్నారు. కొంతమంది అనుకోని విధంగా సక్సెస్ అందుకొని దూసుకుపోతున్నారు.. ఇండస్ట్రీలో ఈసినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందింది హీరోయిన్ శ్రీ లీల (SreeLeela).. తన వయసు చిన్నదైనా పెద్దపెద్ద హీరోలతో చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ లక్షల రెమ్యూనరేషన్ నుంచి కోట్ల రూపాయలకు చేరుకుంది. తెలుగులో అతి చిన్న వయసులో భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడు బాలీవుడ్లో మాత్రమ్ చాలా తక్కువ పారితోషికంతో ముందుకు వెళుతుందట. మరి అక్కడ అంత తక్కువ ఎందుకు తీసుకుంటోంది అనే వివరాలు చూద్దాం..


బిజీ హీరోయిన్ గా మారిన శ్రీ లీల..
.
శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లోనే మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా పలు చిత్రాలు చేసి సక్సెస్ మీద సక్సెస్ అందుకుంటుంది. ఈమె చేసిన సినిమాలు తక్కువే అయినా సక్సెస్ రేటు మాత్రం ఎక్కువగా ఉండటంతో శ్రీలీలను ప్రతి సినిమాలో లక్కీ బ్యూటీగా పరిగణిస్తున్నారు. అలాంటి ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ లో కూడా నేనేం తక్కువ కాదు అనిపించుకుంటుంది. తాజాగా పుష్ప -2 సినిమాలో కిస్సిక్ సాంగులో తన డాన్స్ తో అదరగొట్టిందని చెప్పవచ్చు. ఈ విధంగా తెలుగు,తమిళం, మలయాళం ఇలా అన్ని ఇండస్ట్రీలలో కవర్ చేస్తూ దూసుకుపోతున్నటువంటి శ్రీలీల తాజాగా బాలీవుడ్ వైపు కూడా అడుగులు వేస్తోంది. అక్కడ కూడా ఒక మంచి హిట్ అందుకోవాలని చూస్తోంది. అయితే మిగతా ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఈ హీరోయిన్ బాలీవుడ్ లో మాత్రం చాలా తక్కువ రెమ్యూనరేషన్ కే సినిమా చేస్తోందని తెలుస్తోంది.

బాలీవుడ్లో తగ్గిన శ్రీ లీల..


తాను బాలీవుడ్ లో మొదటిసారి చేస్తున్న చిత్రం కాబట్టి ఆమె పారితోషికం గురించి పెద్దగా ఆసక్తి చూపించలేదట.. పుష్ప-2 (Pushpa-2) లో కిస్సిక్ సాంగ్ కి రూ.2 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్న ఈమె బాలీవుడ్లో మాత్రమ్ సినిమాకి కేవలం రూ.1.75 కోట్లే తీసుకుంటుందని అంటున్నారు. అయితే ఆమె అంత తక్కువ తీసుకోవడం వెనుక ఒక మతలబ్ కూడా ఉందట. ముందుగా బాలీవుడ్ లో నిలదొక్కుకోవాలి.. ఫస్ట్ సినిమా కాబట్టి సూపర్ హిట్ అయితే చాలు ఆ తర్వాత అవకాశాలు తన్నుకుంటూ వస్తాయనే ఆలోచన చేస్తుందట.. అందుకోసమే చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినా కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) తో సినిమా ఒప్పుకుందట.. ఈ సినిమా పేరు పెట్టకముందే టీజర్ విడుదల చేశారు.. దీంతో ఈ టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ అందుకొని దూసుకుపోతోంది.. అయితే ఈ సినిమా టీజర్ చూస్తుంటే మాత్రం ఆషీకీ-3 అని అందరూ భావిస్తున్నారు.ఈ చిత్రం శ్రీలీలకు హిట్ ఇస్తుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది. ఏది ఏమైనా శ్రీలీల చిన్న వయసులో అన్ని ఇండస్ట్రీలు కవర్ చేస్తూ అంతటా తనకంటూ ప్రత్యేకమైనటువంటి క్రేజ్ సంపాదించుకుంటూ దూసుకుపోతుంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×