BigTV English

Actor : వరుస డిజాస్టర్స్… ఆస్తులు అమ్ముకుంటున్న బడా హీరో

Actor : వరుస డిజాస్టర్స్… ఆస్తులు అమ్ముకుంటున్న బడా హీరో

Actor : సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. ఓసారి వరుస హిట్లతో కెరీర్ పీక్స్ లోకి దూసుకెళ్తే, మరోసారి వరుస డిజాస్టర్ లతో నెక్స్ట్ సినిమా ఆఫర్ దొరకడం కూడా కష్టమవుతుంది. అలాగే రీసెంట్ గా వరుస డిజాస్టర్లతో బ్యాడ్ ఫేజ్ లో ఉన్న స్టార్ హీరో, తాజాగా ఒక హిట్టు మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ అంతలోనే ఆయన ఆస్తులు అమ్ముకుంటున్నాడు అనే వార్త హాట్ టాపిక్ గా మారింది.


వరుసగా ఫ్లాట్స్ అమ్మేస్తున్న అక్షయ్ కుమార్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాట్స్ అమ్ముకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన తాజాగా తమ లగ్జరీ అపార్ట్మెంట్ ను భారీ ధరకు అమ్మేశారు. అయితే ఆయన సినిమాలకు, దీనికి ఎలాంటి సంబంధం లేదు. ముంబైలోని ఒబెరాయ్ 360 వెస్ట్ టవర్ లోని తమ అపార్ట్మెంట్ ను దాదాపు 80 కోట్లకు ఈ జంట అమ్మేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీల్ 2025 జనవరి 31న పూర్తయిందట. ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద రియల్ ఎస్టేట్ లావాదేవీలలో ఇది కూడా ఒకటని చెప్పాలి.


ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో ఒబెరాయ్ 360 వెస్ట్ కూడా ఒకటి. ఇందులోని టవర్ బి, 39వ అంతస్తులు అక్షయ్ కుమార్ అపార్ట్మెంట్ ఉంది. 6830 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కలిగి ఉన్న ఈ అపార్ట్మెంట్ కు నాలుగు పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. అక్షయ్ కుమార్ అపార్ట్మెంట్ ని కొనుగోలు చేయడానికి పల్లవి జైన్ అనే మహిళ 4.8 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్టు తెలుస్తోంది.

ఆయన ఇటీవల కాలంలో ఇలా ఫ్లాట్ అమ్మడం ఇదేం మొదటిసారి కాదు. అక్షయ్ (Akshay Kumar) బోరివాలి ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ ను 4.25 కోట్లకు అమ్మేసిన సంగతి తెలిసిందే. 2017లో ఆయన దీన్ని 2.38 కోట్లకు కొనుక్కున్నాడు. దీంతో ఈ ఫ్లాట్ అమ్మకంపై ఆయనకు 78 శాతం లాభం వచ్చింది. ఇక ఈ అపార్ట్మెంట్ కూడా ఒబెరాయ్ రియాలిటీ కి చెందిన స్కై సిటీలో భాగమే.

ఒబెరాయ్ 360 వెస్ట్ లో ఇళ్ళు ఉన్న సెలబ్రిటీలు

ఒబెరాయ్ 360 వెస్ట్ లో సినీ ప్రముఖులతో పాటు వ్యాపార దిగ్గజాలు కూడా నివాసం ఉంటున్నారు. ఇక్కడ బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, అభిషేక్ బచ్చన్, డీ మార్ట్ ఫౌండర్ రాధాకృష్ణ ధమాని, ఎవరెస్ట్ మసాలా గ్రూప్ అధిపతి వ్రతికా గుప్తాకు ఫ్లాట్స్ ఉన్నాయి.

అక్షయ్ కుమార్ అప్ కమింగ్ సినిమాలు

అక్షయ్ కుమార్ (Akshay Kumar) రీసెంట్ గా ‘స్కై ఫోర్స్’ (Sky force) అనే సినిమాలో కనిపించారు. గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లు అందుకుంటున్న ఈ హీరోకి ‘స్కై ఫోర్స్’ మూవీ మంచి బూస్ట్ ఇచ్చింది. ఈ మూవీ దాదాపు 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం ఆయన ప్రియదర్శని దర్శకత్వంలో హర్రర్ కామెడీ మూవీ ‘బూత్ బంగ్లా’లో నటిస్తున్నాడు. అలాగే పరేష్ రావల్, సునీల్ శెట్టిలతో కలిసి ‘హేరా హేరి 3’ అనే మూవీ కూడా చేయబోతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×