BigTV English

Allu Aravind: స్టేజిపై అమ్మాయితో అల్లు అరవింద్ డ్యాన్స్.. వీడియో వైరల్

Allu Aravind: స్టేజిపై అమ్మాయితో అల్లు అరవింద్ డ్యాన్స్.. వీడియో వైరల్

Allu Aravind: గీతా ఆర్ట్స్.. ఇది పేరు కాదు. ఒక బ్రాండ్. ఈ జనరేషన్ లో ఎన్నో ప్రొడక్షన్ హోసెస్ వస్తున్నాయి.. పోతున్నాయి.. కానీ, గీతా ఆర్ట్స్ మాత్రం చిరస్థాయిగా  నిలిచిపోయింది. ఈ ప్రొడక్షన్ హౌస్ ను అల్లు అరవింద్ ఎంతో ప్రాణంగా చూసుకుంటారు. ఇక  ఈ బ్యానర్ లో ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించారు  అల్లు అరవింద్. మధ్యలో కొన్నేళ్లు గీతా పరాజయాలను చవిచూసింది. అయినా వాటిని పట్టించుకోకుండా అల్లు అరవింద్.. ఈ బ్యానర్ ను నిలబెడుతూ వస్తున్నారు. ఇక తాజాగా ఈ బ్యానర్ లో తెరకెక్కుతున్న చిత్రం తండేల్.


అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేల్ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్  ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే తండేల్ నుంచి హైలెస్సో.. హైలెస్సా అనే లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఈవెంట్ ను శిల్ప కళా వేదికలో స్టూడెంట్స్ మధ్య నిర్వహించారు. సాంగ్ రిలీజ్ అనంతరం స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు చిత్ర బృందం సమాధానాలు చెప్పుకొచ్చింది.

2025 Oscar Nominations : 2025 ఆస్కార్ నామినేషన్స్.. ఏ ఏ సినిమాలు పోటీ పడుతున్నాయంటే!


ఇక స్టూడెంట్స్.. తండేల్ నుంచి రిలీజైన సాంగ్స్  కు డ్యాన్స్ లు వేసి మేకర్స్ ను మెప్పించారు. అందులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడా అందించారు. ఇక ఈ వేదికపై అల్లు అరవింద్ చాలా హుషారుగా  కనిపించారు. గత కొన్ని రోజులుగా అల్లు కుటుంబంలో జరిగిన ఘటనల గురించి అందరికీ తెల్సిందే. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, బెయిల్ పై బయటకు రావడం.. ప్రెస్ మీట్, వివాదాలు, విమర్శలు.. ఇలా అల్లు అరవింద్ కొన్ని రోజులుగా ఆ ప్రెషర్ లోనే  ఉన్నాడు. ఇప్పుడిప్పుడే అన్ని చక్కబడుతున్నాయి.

ఇదే కాకుండా తండేల్ సినిమా అవుట్ ఫుట్ కూడా బాగా వచ్చినట్లు సమాచారం. దీంతో ఆయనలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇక ఆ ఆనందంలోనే హైలెస్సో.. హైలెస్సా సాంగ్ కు  అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే.. ఆయన కూడా కాలు కదిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక  ఈ సినిమా గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ .. ” ఈ సినిమాలో నాగచైతన్య యాక్టింగ్ చింపేశాడు. ఎక్కువ చెప్తున్నా అని కాదు కానీ, చై కెరీర్ లోనే   బెస్ట్ పెర్ఫార్మెన్స్. అంతేకాకుండా హయ్యేస్ట్ గ్రాసర్ కూడా. ఈ సాంగ్ మీకు ఎంత నచ్చితే.. సోషల్ మీడియాలో మీరంతా వైరల్ చేయండి” అని స్టూడెంట్స్ కు చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరి 7 న తండేల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో చై ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×