Michael Clarke: భారత క్రికెట్ వ్యవస్థను గాడిన పెట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఇటీవల నూతన నియమావళిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని బీసీసీఐ స్పష్టం చేసింది. పది నిబంధనలతో కూడిన నియమావళిని సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లకు బీసీసీఐ పంపించింది. ఈ పది నిబంధనలలో ఓ ఆటగాడు ఓ సిరీస్ నేపథ్యంలో ఏదైనా టూర్ కి వెళ్ళినప్పుడు అతడితోపాటు కుటుంబ సభ్యులను వెంట తీసుకువెళ్ళడంపై గణనీయమైన పరిమితులను విధించడం జరిగింది.
Also Read: Venkatesh Iyer Injury: KKRకు బిగ్ షాక్.. రూ. 23.75 కోట్ల ప్లేయర్ ఐపీఎల్ కు దూరం ?
బీసీసీఐ ఈ చర్యలను ఓ ఆటగాడి దృష్టి, నిబద్ధతను పెంచడానికి అవసరమైనవిగా సమర్థించినప్పటికీ.. ఈ మార్గదర్శకాన్ని ముఖ్యంగా ఆటగాళ్ల మానసిక ఆరోగ్యంపై, వాటి ప్రభావంపై గణనీయమైన చర్చను రేకెత్తించాయి. విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్లతో కుటుంబ సభ్యులు గడపగలిగే కాల వ్యవధిని పరిమితం చేసింది బీసీసీఐ. ఫారిన్ టూర్లకు భార్య, పిల్లలను అనుమతించేది లేదంటూ బీసీసీఐ తీసుకు వచ్చిన ఈ కొత్త నిబంధన పై ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతుంది.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ బీసీసీఐ ప్రవేశపెట్టిన ఈ నిబంధనపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నిబంధన ఆటగాళ్ల మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసి.. అనారోగ్యకరమైన పరిస్థితులకు దారితీస్తాయని వాదించారు. ఈ నిబంధన పై మైఖేల్ క్లార్క్ స్పందిస్తూ.. ” ఫారిన్ టూర్లకు భార్యా, పిల్లలను తీసుకురావద్దని చెప్పడం చాలా కఠినమైన నిర్ణయంగా అనిపించింది. ఎందుకంటే నేను ఆడిన సమయంలో కూడా ఇలాంటి నిబంధనలు ఉండేవి.
కొన్నిసార్లు భార్య, పిల్లలతో కలిసి వెళ్లేందుకు అవకాశం ఉండేది. మరికొన్నిసార్లు అనుమతి ఉండేది కాదు. ఆ తర్వాత పూర్తిగా భార్యా, పిల్లలతో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఈ నిబంధన వల్ల ప్రొఫెషనల్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. పెళ్లి జరిగి ఇద్దరూ, ముగ్గురు పిల్లలున్న ప్లేయర్లు జట్టులో ఉంటారు. అలాగే పెళ్లి కానీ వారు కూడా జట్టులో ఉంటారు. అందరికీ ఒకే రోల్ అనడం సరైనది కాదు.
Also Read: Umar Nazir: ఎవర్రా ఈ ఉమర్… రోహిత్-రహానేలకు చుక్కలు చూపించిన 6 అడుగుల బుల్లెట్ !
జట్టు రూల్ ప్రకారం ప్లేయర్లతో భార్యా, పిల్లలు పార్ట్నర్స్ ఉండకూడదు. అదే హోటల్ రూమ్ కి అమ్మాయిలను తెచ్చుకుని ఎంజాయ్ చేయవచ్చా..? ఆమెతో కలిసి బార్ కి వెళ్లి డిన్నర్ చేయవచ్చా..? టూర్ జరుగుతున్నంత కాలం, లేదా సిరీస్ జరుగుతున్నంత కాలం భార్య, పిల్లలను.. లేదా ప్రేయసిని మరిచిపోయి బ్రతకాలంటే అయ్యే పని కాదు. చిన్నపిల్లలు ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లకు ఈ నిబంధన చాలా కష్టంగా అనిపిస్తుంది” అని విమర్శించారు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్.
Former Australian captain Michael Clarke shared his thoughts on the newly-introduced rules for the centrally contracted Indian cricketers#MClarke #IndianCricket #BCCI #Insidesport #CricketTwitter pic.twitter.com/ZS5W14A7JN
— InsideSport (@InsideSportIND) January 23, 2025