Rashmika Mandanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు తెలియని వాళ్లు ఉండరు. పుష్ప మూవీతో నేషనల్ క్రష్ అయ్యింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా చేతి నిండా ఆఫర్స్ దూసుకుపోతుంది. గత ఏడాది పుష్ప 2 మూవీతో ప్రేక్షకులను పలకరించిన ఈమె ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. గతంలో రణబీర్ కపూర్ సరసన యానిమల్ మూవీలో నటించింది.. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో రీసేంట్ గా ఛావా మూవీలో నటించి మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. అయితే తాజాగా ఈమె మరోసారి విజయ్ దేవరకొండ ఇంట్లో దొరికింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
రష్మిక మందన్న సినిమాలు..
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా రష్మిక మందన్న వరస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది. అయితే ఛావా మూవీతో మరో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. రీసెంట్ గా సికిందర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఆ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే యావరేజ్ టాక్ ను అందుకుంది. ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలు చేస్తుంది. రష్మిక మందన్న నిజానికి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ట్రిప్పులకు వెళ్తూ బిజీగా ఉంటుంది. తాజాగా ఈమె ఎయిర్పోర్ట్ లో దర్శనమిచ్చింది. అక్కడికి కొంతమంది మీడియా వాళ్లు వెళ్లగా.. అందులో ఓ కెమెరా మ్యాన్ రష్మికకు స్పెషల్‌గా డ్యాన్స్‌తో తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ డ్యాన్స్‌కు ఫిదా అయ్యింది రష్మిక మందన్న.. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఇంట్లో ప్రత్యేక్ష మైంది..
Also Read : అమర్‌తో విడాకులు… బాధతో మరోసారి అన్ని కక్కేసిన తేజస్విని గౌడ..
విజయ్ తో రిలేషన్ కన్ఫామ్..
తాజాగా రష్మిక మందన్న మరోసారి విజయ్ దేవరకొండ ఇంట్లో ప్రత్యక్ష మైంది.. చిన్న పూజ అంటూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో విజయ్ దేవరకొండ ఇంట్లోని సెటప్ లాగా కనిపించింది. వీరిద్దరి మధ్య రిలేషన్ పక్కా అని మరోసారి తేలింది. ఆరేంజ్ కలర్ చీరలో నుదిటన బొట్టుతో క్యూట్ స్మైల్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. నాచురల్ లుక్ లో రష్మిక మందన్న షేర్ చేసిన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి
ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ లో ఈమె నటిస్తున్న సికిందర్ సినిమా ఈ నెలలో రిలీజ్ అవుతుంది. అలాగే తెలుగు లో పుష్ప 3 సినిమాలో నటిస్తుంది. వీటితోపాటు తమిళ్లో మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసిందని సమాచారం.. వీటితో పాటుగా బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేస్తుంది..