Allu Arjun Interrogation: ‘పుష్ప 2’ ప్రీమియర్ షో కోసం అల్లు అర్జున్.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు రావడం దగ్గర నుండి సమస్య మొదలయ్యింది. ఆరోజు పెయిడ్ ప్రీమియర్స్ కావడంతో ప్రేక్షకులు ఎక్కువగా ఉంటారని తెలిసినా అల్లు అర్జున్ అక్కడికి వచ్చాడు. పైగా తాను వస్తున్నట్టుగా ముందే ప్రకటించాడు. అంతే కాకుండా రోడ్ షో చేస్తూ థియేటర్ వరకు రావడంతో ఆ సమయంలో రోడ్డుపై ఉన్న జనాలు కూడా అల్లు అర్జున్ కారును ఫాలో అవుతూ థియేటర్ వరకు వచ్చారు. దీంతో తొక్కిసలాట జరగడం వల్లే రేవతి అనే మహిళ మరణించింది. అందుకే అల్లు అర్జున్ చుట్టూ కూడా ఉచ్చు బిగిసింది. తాజాగా పోలీసులు ఆయనను పిలిచి విచారించగా పలు ప్రశ్నలకు ఆయన మౌనం పాటించినట్టు తెలుస్తోంది.
మౌనంగా ఉండిపోయాడు
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌పై కొన్నాళ్ల క్రితమే కేసు నమోదయ్యింది. కేసు నమోదు అయిన తర్వాత కూడా ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసి తన కోణంలో జరిగిన విషయాన్ని అందరికీ వివరించాడు. అయినా కథ ముగిసిపోలేదు. ఎలాగో కేసు నమోదు అయ్యింది కాబట్టి మంగళవారం ఉదయం అల్లు అర్జున్‌ను విచారణకు పిలిచారు పోలీసులు. దీంతో విచారణ కోసం ఉదయం 11.05 నిమిషాలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు అల్లు అర్జున్. అక్కడ దాదాపుగా మూడున్నర గంటల పాటు ఈ హీరోను విచారించారు. కానీ అందులో పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ (Allu Arjun) సమాధానం ఇవ్వకుండా సైలెంట్‌గా ఉండిపోయాడని సమాచారం.
Also Read: శ్రీతేజ్ తండ్రికి పర్మినెంట్ జాబ్… హామీ ఇచ్చిన దిల్ రాజు
రావద్దని చెప్పినా..
‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాపై ముందు నుండే ప్రేక్షకుల్లో భారీగా బజ్ క్రియేట్ అయ్యింది. అందుకే పెయిడ్ ప్రీమియర్స్‌కు టికెట్ ధరలు భారీగా పెరిగిపోయినా కూడా చాలామంది ఈ సినిమాను చూడడానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో ప్రీమియర్స్‌కు అల్లు అర్జున్.. సంధ్య థియేటర్‌కు వస్తున్నట్టుగా ప్రకటన వచ్చింది. అయితే పెయిడ్ ప్రీమియర్స్‌కు హీరో, హీరోయిన్‌ను థియేటర్‌కు రానివద్దని పోలీసులు నోటీసులు పంపారు. అది మీ దృష్టికి రాలేదా అనే ప్రశ్నకు అల్లు అర్జున్ మౌనం పాటించాడు. నేరుగా థియేటర్‌కు వెళ్లకుండా ఓపెన్ టాప్ వాహనంలో నిలబడి రోడ్ షో ఎందుకు చేశారు అని అడిగితే కూడా ఆయన సైలెంట్‌గానే ఉన్నాడు.
ఇవే ప్రశ్నలు
రోడ్ షోకు మీకు ఎవరు అనుమతి ఇచ్చారు? అలా అనుమతి లేకుండా రోడ్ షో చేయడం తప్పు అని మీకు తెలియదా? ఆ తర్వాత అక్కడ నుండి వెళ్లిపోమని పోలీసులు సూచించినా ఎందుకు వెళ్లలేదు? ఏసీపీ వచ్చి చెప్పినా కూడా ఎందుకు పట్టించుకోలేదు?.. ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్రశ్నలను అల్లు అర్జున్‌పై సంధించినా కూడా తను మాత్రం మౌనంగానే ఉండిపోయాడు. ఇప్పటికీ అల్లు అర్జున్ తాను ఏమీ తప్పు చేయలేదు అన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ కూడా ఆయనకు సపోర్ట్‌గానే మాట్లాడుతున్నారు. మొత్తానికి అల్లు అర్జున్‌కు ఇప్పటినుండి సమస్యలు తప్పవని కామన్ ఆడియన్స్ అనుకుంటున్నారు.